పెళ్లి వేడుకలో ట్యాలెంట్‌తో అదరగొట్టిన వధువు.. వైరల్ అవుతున్న వీడియో.. సందడి మాములుగా లేదుగా..

Published : Dec 27, 2022, 05:16 PM IST
పెళ్లి వేడుకలో ట్యాలెంట్‌తో అదరగొట్టిన వధువు.. వైరల్ అవుతున్న వీడియో.. సందడి మాములుగా లేదుగా..

సారాంశం

పెళ్లి వేడుకల్లో ఓ వధువు తన ట్యాలెంట్ చూపించి అదరగొట్టింది. సంగీత వాయిద్యం చెండా మేళం(డ్రమ్స్) వాయించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

పెళ్లి వేడుకల్లో ఓ వధువు తన ట్యాలెంట్ చూపించి అదరగొట్టింది. సంగీత వాయిద్యం చెండా మేళం(డ్రమ్స్) వాయించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేరళ చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. త్రిస్సూర్ జిల్లా గురువాయూర్‌లో దేవానంద్‌తో శిల్పా శ్రీకుమార్ వివాహం జరిగింది. అయితే వివాహ వేడుక సందర్భంగా వధువు శిల్ప చెండా మేళం వాయింది అదరగొట్టారు. అయితే కేరళలోని పెళ్లిలు, ఇతర వేడుకలప్పుడు చెండా మేళం వాయించడం సంప్రదాయంగా వస్తుంది. 

అయితే తన పెళ్లి వేడుక సందర్భంగా శిల్ప కూడా చెండా మేళం వాయిస్తూ కనిపించారు. కొద్దిసేపటి తర్వాత శిల్ప తండ్రితో పాటుగా వరుడు కూడా ఆమెతో జాయిన్ అయ్యారు. ఈ వీడియో @LHBCoach అకౌంట్ నుంచి ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. ‘‘ఈరోజు గురువాయూరు ఆలయంలో కళ్యాణం జరిగింది. వధువు తండ్రి చెండా మాస్టర్. కూతురు ఆమె పెళ్లిరోజు ఉత్సాహంగా ఆడుతుంది. చివరికి ఆమె తండ్రి కూడా చేరాడు. వరుడు కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది’’అని ఆ నెటిజన్ పేర్కొన్నారు. 

అయితే రిపోర్ట్స్ ప్రకారం.. శిల్ప కొన్నేళ్లుగా చెండా మేళం వాయించడం నేర్చుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే పెళ్లిలో చెండా మేళం వాయించాలని అనుకోలేదని.. అయితే చివరి క్షణంలో అది ప్రణాళికలో చేరిందని ఆమె చెప్పారు. ఇక, వధువు ఉత్సాహంగా డ్రమ్స్ వాయించడంతో బంధువులు, పెళ్లికి వచ్చిన అతిథులు కూడా జోష్‌లో మునిగిపోయారు. 

 

ఇక, వధువు శిల్పా శ్రీకుమార్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొత్త జంటను విష్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ఇది మనసును కదిలించే వీడియో.. గురువాయూరప్పన్ వారి వివాహాన్ని ఆశీర్వదించండి’’ అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ‘‘ఈ వధూవరులు ఎంతో ప్రేమ, సంతోషాన్ని వ్యక్తం చేశారు! వారికి అందమైన జీవితం ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను! దేవుడు ఆశీర్వదిస్తాడు !!’’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !