Rahul Gandhi : దేశానికి అగ్ర దేశాధినేతలు వస్తున్న వేళ.. విదేశాలకు రాహుల్ గాంధీ..

Published : Sep 06, 2023, 03:22 AM IST
Rahul Gandhi : దేశానికి అగ్ర దేశాధినేతలు వస్తున్న వేళ.. విదేశాలకు రాహుల్ గాంధీ..

సారాంశం

Rahul Gandhi : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ యూరోపియన్ యూనియన్ (ఈయూ) లాయర్లు, విద్యార్థులు, ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ మెదటివారంలో ఈ పర్యటన ప్రారంభం కాగా.. దాదాపు వారం రోజులపాటు ఈ పర్యటన సాగనున్నది. ఈ సందర్భంగా ఆయన యూరోపియన్ యూనియన్ (EU) చట్టసభ సభ్యులతో పాటు పారిస్‌లోని యూనివర్సిటీలో విద్యార్థులు, భారతీయ ప్రవాస భారతీయులతో సమావేశమవుతారని వర్గాలు తెలిపాయి.

రాహుల్ గాంధీ యూరప్ షెడ్యూల్‌

  • విశ్వసనీయ మూలాల ప్రకారం.. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 3న యూరప్ వెళ్లనున్నారు.
  • సెప్టెంబరు 7న బ్రస్సెల్స్‌లో EU న్యాయవాదుల బృందంతో భేటీ కానున్నారు. హేగ్‌లో కూడా అదే విధమైన సమావేశం కానున్నారు.  
  • సెప్టెంబర్ 8, 9 తేదీల్లో పారిస్ లో పర్యటించనున్నారు.
  • సెప్టెంబర్ 8 న పారిస్‌లోని పియరీ అండ్ మేరీ క్యూరీ విశ్వవిద్యాలయ విద్యార్థులతో సమావేశమవుతారు. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
  •  సెప్టెంబర్ 9న పారిస్‌లో జరిగే ఫ్రెంచ్ కార్మిక సంఘం సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అనంతరం నార్వేకు బయలుదేరి వెళ్లనున్నారు. 
  • సెప్టెంబర్ 10న రాహుల్ ఓస్లోలో జరిగే డయాస్పోరా కార్యక్రమంలో ప్రసంగిస్తారు. 
  • సెప్టెంబర్ 11న నార్వేలోని ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు
  • సెప్టెంబర్ 14న రాహుల్ భారత్‌కు తిరిగి రానున్నారు.

న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు జీ20 సదస్సు జరగనుంది. గ్రూప్‌కు ప్రస్తుత చైర్‌గా భారత్ జి20 సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా 30 మందికి పైగా జాతీయ అధ్యక్షులు పాల్గొంటారు. దేశాధినేతలతో పాటు, EU ఆహ్వానించబడిన అతిథి దేశాల నుండి ఉన్నతాధికారులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు పాల్గొంటారు. ఈ తరుణంలో రాహుల్ గాంధీ యూరప్ లో పర్యటించనున్నారనేది చర్చనీయాంశంగా మారింది. అలాగే.. రాహుల్ గాంధీ గత విదేశీ పర్యటనలో భారత్ లో కీలక పరిణాలు తీవ్ర వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన విషయం తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu