Chandrayaan-3: సూపర్ .. చంద్రుడి ఉపరితలం 3 డీ ఫోటోను విడుదల చేసిన ఇస్రో.. మీరు కూడా ఓ లూక్కేయండి..

Published : Sep 06, 2023, 01:49 AM IST
Chandrayaan-3: సూపర్ .. చంద్రుడి ఉపరితలం 3 డీ ఫోటోను విడుదల చేసిన ఇస్రో.. మీరు కూడా ఓ లూక్కేయండి..

సారాంశం

Chandrayaan-3:భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుని దక్షిణ ధ్రువంలో ప్రజ్ఞాన్ రోవర్ సహాయంతో ప్రత్యేక సాంకేతికత ద్వారా తీసిన 3డి 'అనాగ్లిఫ్'చిత్రాన్ని విడుదల చేసింది. మీరు ఆసక్తికరమైన వీక్షణను కూడా చూడవచ్చు.

Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ లోని  ప్రజ్ఞాన్ రోవర్, ల్యాండర్లు చంద్రుడిపై కాలు మోపిన నాటి నుంచి అవి అందించే ప్రతి విషయం ఆసక్తికరమే.ఈ ఆసక్తికర సమాచారాన్ని ఇస్రో తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఇస్రో మంగళవారం తన ట్విట్టర్ హ్యాండిల్‌లో చంద్రుడి ఉపరితలం యొక్క 3డి చిత్రాన్ని పంచుకుంది.ప్రజ్ఞాన్ రోవర్ లో అమర్చిన 'అనాగ్లిఫ్' టెక్నిక్ ఉపయోగించి ఈ చిత్రాన్ని తీసినట్టు ఇస్రో పేర్కొంది. 

చంద్రుడి 3డి చిత్రాన్ని ఇస్రో మంగళవారం సాయంత్రం 6 గంటలకు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ.. ఈ చిత్రాన్ని అనాగ్లిఫ్ నవ్‌క్యామ్ స్టీరియో ఇమేజ్‌ని ఉపయోగించి తీశామని ఇస్రో తెలిపింది. ఈ చిత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే.. రెడ్, సియాన్ రంగుల్లో ఉన్న భాగాలు కనిపిస్తాయి. అందులో ఎడమ, కుడి వైపుల చిత్రాలుంటాయి. ఎడమ వైపున ఉన్న చిత్రం రెడ్ రంగులో ఉందనీ, అలాగే కుడి వైపున ఉన్న చిత్రం నీలం, ఆకుపచ్చ రంగులో కనిపిస్తోందని ఇస్రో వివరించింది. ఈ రెండు చిత్రాల మధ్య దృక్కోణంలో వ్యత్యాసం స్టీరియో ఎఫెక్ట్‌ అని తెలిపింది. 

అనాగ్లిఫ్ టెక్నాలజీ అంటే ఏమిటి?

అనాగ్లిఫ్ అనేది స్టీరియో లేదా మల్టీ వ్యూ చిత్రాల నుండి మూడు కోణాలలో ఒక వస్తువు లేదా భూభాగం యొక్క సరళీకృత వీక్షణ అని ఇస్రో వివరించింది. ఈ చిత్రాన్ని త్రీడీ గ్లాసెస్‌లో చూస్తే.. ఈ చిత్రాన్ని మరింత అందంగా చూడవచ్చని ఇస్రో తెలిపింది. ఈ దృశ్యాన్ని చూస్తే మీరు చంద్రునిపై నిలబడిన అనుభూతి కలుగుతుందని తెలిపింది

మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఇస్రో తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ చిత్రాన్ని షేర్ చేసింది.ఈ ఫోటోలను 1.6 మిలియన్ల మంది ఫోటోను చూడగా, దాదాపు 45 వేల మంది లైక్ చేశారు. ఈ అరుదైన ఫోటోను చూసిన ప్రజలు ఇస్రోను ఎంతగానో కొనియాడుతున్నారు. ఇస్రో భారతదేశానికి గర్వకారణమని పేర్కొంటున్నారు. ఈ దృశ్యం అద్భుతంగా ఉందని మరికొందరూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu