
Union minister Kiren Rijiju: బ్రిటన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతూనే ఉంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ల మధ్య మాటల యద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ ప్రసంగం క్లిప్ ను షేర్ చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. కాంగ్రెస్ నాయకుడు భారతదేశాన్ని విభజించడానికి ప్రజలను రెచ్చగొడుతున్నారనీ, ఇది భారతదేశ ఐక్యతకు చాలా ప్రమాదకరంగా మారిందని ఆరోపించారు. స్వయంగా కాంగ్రెస్ యువరాజుగా ప్రకటించుకున్న రాహుల్ గాంధీ.. అన్ని పరిమితులను అధిగమించారని విమర్శించారు.
Rahul Gandhi Ji will not listen to us but I hope he listens to his devoted well wishers! pic.twitter.com/ghuJ2mqSii
"ఈ వ్యక్తి భారత ఐక్యతకు అత్యంత ప్రమాదకరంగా మారారు. ఇప్పుడు భారతదేశాన్ని విడగొట్టాలని ప్రజలను రెచ్చగొడుతున్నారు. భారతదేశపు అత్యంత ప్రజాదరణ పొందిన, అందరూ ఇష్టపడే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏకైక మంత్రం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్" అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
People of India know Rahul Gandhi is Pappu but foreigners don't know that he is actually Pappu.
And it's not necessary to react to his Foolish Statements but the problem is that his Anti-India statements are misused by the Anti-India Forces to tarnish the image of India.
రాహుల్ గాంధీ తన కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రసంగంలో ప్రధాని మోడీ భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. 'భారతదేశం రాష్ట్రాల సమాఖ్య. ఇది ఒక సంప్రదింపుల క్రమంలో కూడుకుని ఉంటుంది. మీరు ఒక ఆలోచనను యూనియన్ పై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తే, అది ప్రతిస్పందిస్తుంది. ఇక్కడ ఒక సిక్కు పెద్దమనిషి కూర్చున్నాడు. అతను సిక్కు మతానికి చెందినవాడు. భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు సహా వివిధ మతాలు, భాషలకు చెందిన వారు ఉన్నారు. వారంతా భారతీయులే. తాను కాదని నరేంద్ర మోడీ అంటున్నారు.. నరేంద్ర మోడీ తాను భారత్ లో ద్వితీయ శ్రేణి పౌరుడినని చెప్పారు. ఆయనతో నేను ఏకీభవించను' అని రాహుల్ గాంధీ కేంబ్రిడ్జి ప్రసంగంలో పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై కిరణ్ రిజిజు స్పందిస్తూ.. రాహుల్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ.. భారత్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు భారత వ్యతిరేక శక్తులు ప్రకటనలను చేస్తున్నాయంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ పప్పు అని భారత ప్రజలకు తెలుసు, కానీ విదేశీయులకు ఆయన నిజంగా పప్పు అని తెలియదని రిజిజు విమర్శించారు. అంతకుముందు, యూకే పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ విదేశీ గడ్డ నుంచి భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించారని బీజేపీ ఆరోపించింది.