ఢిల్లీ లిక్కర్ స్కాం: మూడు రోజులుగా అరుణ్ రామచంద్రపిళ్లైని విచారిస్తున్న ఈడీ

Published : Mar 09, 2023, 11:57 AM IST
ఢిల్లీ లిక్కర్ స్కాం: మూడు రోజులుగా అరుణ్ రామచంద్రపిళ్లైని  విచారిస్తున్న ఈడీ

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అరుణ్ రామచంద్రపిళ్లైని  ఈడీ అధికారులు  విచారిస్తున్నారు.  సౌత్ గ్రూప్ విషయమై  ఈడీ అధికారులు  పిళ్లైని  ప్రశ్నించే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. 

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో  మూడు రోజులుగా  అరుణ్ రామచంద్రపిళ్లైని  ఈడీ అధికారులు  విచారిస్తున్నారు.  గురువారంనాడు కూడా  ఈడీ అధికారులు ఈ కేసు విషయమై  విచారణ  చేస్తున్నారు. 

ఈ  నెల  6వ తేదీ రాత్రి  అరుణ్ రామచంద్రపిళ్లైని  ఈడీ అధికారులు అరెస్ట్  చేశారు. ఈ నెల 7వ తేదీన  ఆయనను కోర్టులో హజరుపర్చారు.   అరుణ్ రామచంద్రపిళ్లైని తమ కస్టడీకి ఇవ్వాలని  కోర్టును ఈడీ అధికారులు కోరడంతో   కస్టడీకి ఇచ్చింది కోర్టు.  దీంతో  అరుణ్ రామచంద్రపిళ్లైని  ఈడీ అధికారులు విచారిస్తున్నారు. 

అరుణ్ రామచంద్రపిళ్లై  రిమాండ్  రోప్టులో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత  పేరును  ఈడీ అధికారులు  ప్రస్తావించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సౌత్ గ్రూప్  కీలకంగా  వ్యవహరించిందని  దర్యాప్తు  సంస్థలు  అనుమానిస్తున్నాయి.  సౌత్  గ్రూప్  పాత్రపై  అరుణ్ రామచంద్రపిళ్లైని  ఈడీ అధికారులు విచారిస్తున్నారు.మరో వైపు ఇదే విషయమై తీహార్ జైల్లో  ఉన్న  ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం  మనీష్ సిసోడియాను  విచారించనున్నారు ఈడీ అధికారులు. 

అరుణ్ రామచంద్రపిళ్లైని  మూడు రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై   ప్రశ్నిస్తున్నారు.కవిత  ప్రతినిధిగా  తాను  వ్యవహరించినట్టుగా  అరుణ్ రామచంద్రపిళ్లై ఈడీ విచారణలో  ఒప్పుకున్నారని  ఈడీ అధికారులు  పేర్కొన్నారు. కవిత విషయంలో అరుణ్ రామచంద్రపిళ్లై చేసిన వ్యాఖ్యలు నిజమేనా అనే విషయమై  విచారణలో తేలనుంది. 

also మార్చి 11నే విచారణకు ఎమ్మెల్సీ కవిత, స్పష్టం చేసిన ఈడీ.. రేపు ధర్నా యధాతథం..

ఈ నెల  11వ తేదీన  ఈడీ విచారణకు హాజరుకానున్నట్టుగా ఎమ్మెల్సీ కవిత  ఈడీ అధికారులకు  సమాచారం పంపారు.  అరుణ్ రామచంద్రపిళ్లై, కవితను  ముఖాముఖి  ఈడీ అధికారులు విచారించే  అవకాశం ఉందని  చెబుతున్నారు.ఈ నెల  9వ తేదీనే   కవిత  ఈడీ విచారణకు  వెళ్లాల్సి ఉంది.  అయితే ఈ నెల  10వ తేదీన   ఢిల్లీలో  దీక్ష ఉన్న నేపథ్యంలో  విచారణకు  హాజరయ్యేందుకు  సమయం కావాలని  కవిత ఈడీని కోారు.ఈ నెల  11న   విచారణకు హాజరు కానున్నట్టుగా  కవిత  ఈడీకి  సమాచారం పంపారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu