
CEC Jnanesh Kumar Impeachment Motion: కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి దూకుడు పెంచింది. ఎన్నికల సంఘం (ECI)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన తీవ్రమైన ఆరోపణలు చేసి, దేశ రాజకీయాలను షేక్ చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో భారీ స్థాయిలో ఓటర్ల మోసం జరిగిందని, ఓటర్ల డేటాను తారుమారు చేసి బీజేపీకి లాభం చేకూర్చిందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రతిపక్ష ఇండియా కూటమి మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ ఏకంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)ను టార్టెట్ చేసింది. ఇంతకీ ఏం జరుగుతోందంటే?
ఎన్నికల సంఘం (ECI)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన తీవ్రమైన ఆరోపణలతో దేశ రాజకీయ ఒక్కసారిగా హీటెక్కింది. భారీ స్థాయిలో ఓటర్ల మోసం జరిగిందని, ఓటర్ల డేటాను తారుమారు చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందనీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. ఓట్ల చోరీ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని, లేకుంటే దేశానికి క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీకి సీఈసీ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇండియా కూటమి మరో అడుగు వేస్తూ.. ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉందని సమాచారం.
రాహుల్ గాంధీ ఆరోపణలు
ఆగస్టు 7న రాహుల్ గాంధీ బెంగళూరు సెంట్రల్‌లోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో 1,00,250 "దొంగిలించబడిన" ఓట్లు బీజేపీ విజయంలో కీలకమయ్యాయని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లు, చెల్లని చిరునామాలు, ఒకే చిరునామాలో డజన్లకొద్దీ ఓటర్ల రిజిస్ట్రేషన్లు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. "ఓటు చోరీ" జరిగిందని, ఎన్నికల సంఘం అధికార పార్టీతో కుమ్మక్కైందని తీవ్రస్థాయిలో విమర్శించారు. అంతేకాదు, పోలింగ్ బూత్‌ల సిసిటివి, వెబ్‌కాస్టింగ్ ఫుటేజ్‌లను కేవలం 45 రోజులకే డిలీట్ చేశారని రాహుల్ గాంధీ విమర్శించారు.
ఈసీ ప్రతిస్పందన
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలకు ఈసీ కూడా ఘూటుగా స్పందించింది. సిఇసి జ్ఞానేష్ కుమార్ ఢిల్లీలో విలేకరుల సమావేశం మాట్లాడుతూ.. రాహుల్ ఆరోపణలను "నిరాధారమైనవి, రాజ్యాంగాన్ని అవమానించేవి" అని తోసిపుచ్చారు. రాహుల్ గాంధీ "అఫిడవిట్ ఇవ్వాలి లేదా దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడు రోజుల్లో అఫిడవిట్ సమర్పించకపోతే, ఆరోపణలు అసత్యమని తేలుతుంది" అని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. అదే సమయంలో, సిసిటివి ఫుటేజ్ షేర్ చేయడం ఓటర్ల గోప్యతకు విరుద్ధమని, డ్రాఫ్ట్ రోల్స్ దశలో ఎటువంటి అభ్యంతరాలు రాకపోయినప్పటికీ ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. "సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, ఎవరైనా వేరుగా చెబితే అది నిజం కాదు" అంటూ జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు.
ప్రతిపక్షం ఎదురుదాడి
సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ "స్వతంత్ర రాజ్యాంగ అధికారి వ్యాఖ్యలు బీజేపీ కార్యకర్త వ్యాఖ్యల్లా అనిపించాయని విమర్శించారు. ఆర్జెడి నేత మనోజ్ ఝా మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ సమర్పించిన పత్రాల ప్రామాణికతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అభిశంసన తీర్మానం
ఆర్టికల్ 324(5) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగించే విధంగానే సీఈసీని తొలగించవచ్చు. అంటే, పార్లమెంటులో అభిశంసన తీర్మానం ఆమోదం తప్పనిసరి. అందుకే ప్రతిపక్ష ఇండియా కూటమి ఇప్పుడు ఆ దిశగా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష ఆరోపణలు, ఆ ఆరోపణలను ఖండిస్తూ సిఇసి జ్ఞానేష్ కుమార్ కఠిన సమాధానాలు ఇచ్చారు. ఇలా ఇరువైపులా ఆరోపణలతో దేశ రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. రాబోయే రోజుల్లో ప్రతిపక్షం అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతుందా? లేక గాంధీ అఫిడవిట్ ఇస్తారా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.