రాజకీయ ప్రక్రియలో జోక్యం: ట్విట్టర్ పై రాహుల్ సీరియస్

Published : Aug 13, 2021, 12:55 PM IST
రాజకీయ ప్రక్రియలో జోక్యం: ట్విట్టర్ పై రాహుల్ సీరియస్

సారాంశం

ట్విట్టర్ పై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశం పంపారు. ట్విట్టర్ పక్షపాతంగానే వ్యవహరిస్తోందన్నారు. తటస్థ వేదిక కాదని తేటతెల్లమైందన్నారు.


న్యూఢిల్లీ: ట్విట్టర్‌పై  కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ శుక్రవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ ఓ వీడియోను  ఆయన సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ట్విట్టర్ వ్యవహరిస్తున్నతీరును ఆయన తప్పుబట్టారు. సోషల్ మీడియా ధిగ్గజం తీరు ప్రజాస్వామ్యంపై దాడిగా పేర్కొన్నాడు. ట్విట్టర్ తన వ్యాపారం కోసం దేశ రాజకీయాలను ఉపయోగించుకొంటుందన్నారు. ట్విట్టర్  తటస్థమైన వేదిక కాదని తేలిందన్నారు. ఇది పక్షపాత వేదికని రుజువైందని ఆ వీడియోలో ఆయన ఆరోపించారు. 

తన ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయడం ద్వారా  తమ రాజకీయ ప్రక్రియలో జోక్యం చేసుకొంటున్నారు.మన రాజకీయాలను నిర్వచించడానికి ఒక కంపెనీ  తన వ్యాపారం చేస్తోందన్నారు. ఓ రాజకీయనేతగా  తాను దానిని ఇష్టపడనని ఆయన చెప్పారు.

also read:కాంగ్రెస్‌కి ట్విట్టర్ షాక్: అధికారిక ఖాతాతో పాటు 5 వేల అకౌంట్స్ బ్లాక్

తన ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయడం దేశ ప్రజాస్వామ్య నిర్మాణంపై దాడిగా ఆయన పేర్కొన్నారు. ఈ దాడి రాహుల్ గాంధీపై దాడి కాదన్నారు. తనకున్న 19-20 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారన్నారు. వారి అభిప్రాయాన్ని కూడ నిరాకరిస్తున్నారని తేలిందని ఆయన ఆ  వీడియోలో పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ సహా ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలు బ్లాక్  అయ్యాయి. ఆ పార్టీకి చెందిన 5 వేల మంది ముఖ్యుల ట్విట్టర్ ఖాతాలు కూడ లాక్ అయ్యాయి.   పార్టీ అధికార ప్రతినిధుల ట్విట్టర్ ఖాతాలు బ్లాక్ అయ్యాయి.


 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు