జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: లష్కరేతోయిబా టెర్రరిస్ట్ మృతి, నలుగురికి గాయాలు

By narsimha lodeFirst Published Aug 13, 2021, 12:26 PM IST
Highlights

జమ్మూలో లష్కేరే తోయిబా ఉగ్రవాది హతమయ్యారు. భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది మరణించారని అధికారులు తెలిపారు.  మరో ఇద్దరు ఉగ్రవాదులను  పోలీసులు తమ అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు సహా మరో ఇద్దరు సాధారణ పౌరులకు గాయాలయ్యాయి.

శ్రీనగర్:  లష్కరే తోయిబా కు చెందిన ఓ ఉగ్రవాది భద్రతా దళాల కాల్పుల్లో మరణించినట్టుగా అధికారులు తెలిపారు.జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కుల్గామ్ లో శుక్రవారం నాడు భద్రతా దళాలు, ఉగ్రవాదులకు జరిగిన కాల్పుల్లో టెర్రరిస్టు మరణించాడని  సెక్యూరిటీ సిబ్బంది ప్రకటించారు.

గురువారం నాడు రాత్రి భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎస్ జవాన్లతో పాటు పలువురు సామాన్యులు కూడా గాయపడ్డారని ఓ వార్తా సంస్థ తెలిపింది.

కుల్‌గామ్ జిల్లాలోని ఖాజీగుండ్ ప్రాంతంలోని జమ్మూ -శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న మల్బోరా వద్ద బీఎస్ఎప్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకొన్నాయని బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు.

ఉగ్రవాదులు, సెక్యూరిటీ సిబ్బందికి మధ్య  ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఇద్దరు జవాన్లు, ఇద్దరు  సాధారణ పౌరులు గాయపడ్డారని జమ్మూ కాశ్మీర్  ఐజీ తెలిపారు.ఈ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో శ్రీనగర్- జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను నిలిపివేశారు.

click me!