రాత్రి సంతోషంగా గడిపిన కుటుంబం, తెల్లారేసరికి... ముగ్గురు మృతితో విషాదం... !

Published : Aug 13, 2021, 11:55 AM IST
రాత్రి సంతోషంగా గడిపిన కుటుంబం, తెల్లారేసరికి... ముగ్గురు మృతితో విషాదం... !

సారాంశం

 కొన్ని రోజులుగా పడుతున్నవర్షాలకు బాగా నానిపోయిన ఆ ఇంటి భారీ గోడ అర్ధరాత్రి సమయంలో కూలిపోయింది. లోపలపడుకున్న మీనా దేవి, ప్రియదర్శిని, ఆయుషిలు ఆ గోడ కింద ఇరుక్కుని నిద్రలోనే ప్రాణాలు విడిచారు.  

బీహార్ లో దారుణం జరిగింది. రాత్రి సంతోషంగా గడిపిన ఆ కుటుంబంలో తెల్లవారేసరికి విషాదం నిండింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ వ్యక్తి రాత్రి భార్య, కూతురు, మనవరాళ్లతో కలిసి ఇంట్లో భోజనం చేశాడు. ఆ ముగ్గురినీ ఇంట్లో పడుకోబెట్టి తలుపు వేసి అతను బయట పడుకున్నాడు. ఉదయం నిద్రలేచి తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. 

అక్కడి దృశ్యం చూసి అతను నోట మాట రాక షాక్ అయ్యాడు. ఇంటి గోడ కింద ఆ ముగ్గురూ విగతజీవులై కనిపించారు. బీహార్ లోని ముజఫరా నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమస్తిపూర్ గ్రామానికి చెందిన సురేంద్ర చౌదరి బుధవారం రాత్రి తన భార్య మీనా దేవి (60), కూతురు ప్రియదర్శిని (23), మనవరాలు ఆయుషి (5)లతో కలిసి భోజనం చేశాడు. 

ఆ తర్వాత ఆ ముగ్గురు ఇంటి లోపల పడుకున్నారు. సురేంద్ర ఆరు బయట పడుకున్నాడు. కొన్ని రోజులుగా పడుతున్నవర్షాలకు బాగా నానిపోయిన ఆ ఇంటి భారీ గోడ అర్ధరాత్రి సమయంలో కూలిపోయింది. లోపలపడుకున్న మీనా దేవి, ప్రియదర్శిని, ఆయుషిలు ఆ గోడ కింద ఇరుక్కుని నిద్రలోనే ప్రాణాలు విడిచారు.

ఉదయం నిద్ర లేచిన సురేంద్ర తలుపు తీసి లోపలికి వెల్దామని చూసి,  అక్కడ కనిపించిన దృశ్యం చూసి, గట్టిగా కేకలు వేశాడు. చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఆ ముగ్గురి మృతదేహాలను అతి కష్టం మీద బయటకు లాగారు. సమాచారం అందుకున్న పోలీసులు  అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

PREV
click me!

Recommended Stories

బీహార్ రాజకీయాల్లో 30ఏళ్ల BJP కోట బద్దలు ప్రశాంత్ కిషోర్ చారిత్రక విజయం| Prashant Kishor victory
త్వరలో ప్లాస్టిక్ నోట్లు...ఇక పాత నోట్లు బ్యాన్ చేస్తారా? | Plastic Currency in India