Rahul Gandhi: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా టీకాల అందిస్తున్న విషయంలో రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. బూస్టర్ డోసులు ఎప్పుడిస్తారంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు.
Rahul Gandhi : ఇటీవలే వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా దేశాల్లో పంజా విసురుతోంది. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. దీనిని అడ్డుకట్ట వేయడంలో కరోనా టీకాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ఇదివరకటి కరోనా వేరియంట్ల కంటే అత్యంత ప్రమాదకరంగా వ్యాపిస్తున్నదనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా టీకాలు అందించడంలో వేగం పెంచడం కీలకమని పేర్కొంది. ఈనేపథ్యంలోనే చాలా దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి. భారత్ లోనూ విస్తృతంగా కొనసాగుతోంది. టీకాలు అందించడంలో అనుకున్న లక్ష్యాలు చేరుకోకపోవడంపై ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో అత్యధిక జనాభాకు ఇంకా వ్యాక్సినేషన్ పూర్తికాలేదని అన్నారు. భారత ప్రభుత్వం బూస్టర్ డోసులను అందించడం ఎప్పుడు ప్రారంభిస్తుందని రాహుల్ బుధవారం ట్వీట్టర్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇదే వేగంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగితే డిసెంబర్ ముగిసే నాటికి కేవలం 42 శాతం జనాభాకే వ్యాక్సినేషన్ పూర్తవుతుందన్నారు. కాబట్టి కరోనా థర్డ్‌వేవ్‌ను నివారించాలంటే డిసెంబర్ చివరి నాటికి కనీసం 60 శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తికావాలని రాహుల్ పేర్కొన్నారు.
Also Read: నాలుగేండ్లలో 3117 మంది మైనారిటీలకు భారత పౌరసత్వం: కేంద్రం
undefined
ఇదిలావుండగా, ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచార ర్యాలీ సందర్భంగా రాహుల్ గాందృ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం, ఒమిక్రాన్ భయాందోళనలు ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ విషయాలను సైతం ఆయన ప్రస్తావించారు. థర్డ్ వేవ్ వస్తే దానిని ఎదుర్కొవడానికి దేశంలో 60 శాతం మందికి టీకాలు అందించాల్సిన ప్రధాన్యతను ప్రస్తావించారు. కాగా, దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొత్త వేరియంట్ కేసులు డబుల్ సెంచారీ దాటాయి. ఒమిక్రాన్ వేరియంట్ మొత్తం కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్ర, ఢిల్లీలోనే వెలుగుచూశాయని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసులు అత్యధికం దేశరాజధాని ఢిల్లీలోనే 57 కేసులు నమోదయ్యాయి. రెండు స్థానంలో ఉన్న మహారాష్ట్ర 54 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఢిల్లీలో 57, మహారాష్ట్రలో 54, తెలంగాణలో 24, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో 2, ఒడిశాలో 2, ఉత్తరప్రదేశ్ లో 2, ఆంధ్రప్రదేశ్, ఛండీగఢ్, లద్దాఖ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ ఒమిక్రాన్ బారినపడి కోలుకున్న వారి సంఖ్య సైతం అధికంగానే ఉంది. దేశంలో కొత్త వేరియంట్ సోకిన వారిలో ఇప్పటివరకు 90 మంది కోలుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.
Also Read: Odisha: ఒడిశాలో కోటి రూపాయల డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
ఇదిలావుండగా, కరోనా వైరస్ దేశంలో మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో భారత్ లో కొత్తగా 6,317 మందికి కరోనా వైరస్ సోకిందని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,47,58,481 కి చేరింది. ఇదే సమయంలో కొత్తగా 6,906 మంది బాధితులు కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. మొత్తం కరోనా రికవరీల సంఖ్య 3,42,01,966కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం 78,190 యాక్టివ్ కేసులున్నాయి. అలాగే, గత 24 గంటల్లో కరోనా మహమ్మారితో పోరాడుతూ 318 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 4,78,325కు పెరిగింది.
Also Read: Omicron: దేశంలో కొత్తగా 13 ఒమిక్రాన్ కేసులు.. అత్యధికం ఢిల్లీలోనే !