కేసీఆర్ కు జగన్ ఝలక్ ఇవ్వడానికే.. అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి.. రఘురామ

By SumaBala BukkaFirst Published Jun 2, 2023, 6:44 AM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడానికి వివేకా హత్య కేసుకు లింకు ఉందని.. జగన్, కేసీఆర్ కు ఝలక్ ఇస్తున్నాడని రఘురామ అన్నారు. 

ఢిల్లీ : వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోసం చేస్తున్నారంటూ  ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంను.. వివేకాహత్య కేసుకు ముడిపెడుతూ.. మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రఘురామ గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఆ కుంభకోణంలో కొందరు కీలక వ్యక్తుల పాత్ర గురించి చెప్పడానికే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారినట్లు కనిపిస్తోందన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కొందరి పాత్రను వెల్లడిస్తే వివేకా హత్య కేసులో ఓ కీలక వ్యక్తి పేరు బయటకు రాకుండా చూస్తామని కొందరు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయన్నారు. దీన్ని బట్టి చూస్తే కెసిఆర్ ను, జగన్ మోసం చేస్తున్నట్లుగా అర్థమవుతుందంటూ విశ్లేషించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉన్నట్లుగా సాక్షి పత్రికలో వార్తా కథనాలు రాశారు. అంతేకాకుండా ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి.. అరెస్టై, బెయిలు తీసుకుని.. అప్రూవర్ గా మారాడు.  రత్ చంద్రారెడ్డి జగన్కు అత్యంత సన్నిహితుడు. 

స్వయానా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడికి అన్న. అతను అప్రూవర్ గా మారబోతున్నాడని అంతకు రెండు రోజుల క్రితమే వార్త వచ్చింది. చివరికి అదే నిజమయ్యింది. వారు ఊహించినట్టుగా ఆ వచ్చిన వార్తా కథనం నిజమైనప్పుడు.. శరత్ చంద్రారెడ్డి కొన్ని పేర్లు చెపితే..  వివేకా హత్య కేసులో కుట్రకోణం నుంచి కీలక వ్యక్తిని పేరు రాకుండా చూసుకుంటామని చెప్పారని వచ్చిన వార్తలు కూడా నిజమవుతాయి.  అది నమ్మినప్పుడు ఇది కూడా నమ్మాల్సి వస్తుంది.

ఇదంతా చూస్తుంటే కేసీఆర్ ను, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోసం చేస్తున్నట్లుగానే తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల్లో మా పార్టీ గెలవడానికి ఎంతో సహాయం చేశారన్న వాదనలు ఓవైపు ఉన్నాయి. అలాంటి సమయంలో జగన్  ఆయనకు ద్రోహం చేయాడం బాధ కలిగించే విషయం. అప్రూవల్ గా మారిన శరత్ చంద్రారెడ్డి లిక్కర్ స్కామ్ లో ఎవరెవరి పేర్లు చెబుతారో..  దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.’  అన్నారు.

అంతేకాదు.. వివేకా హత్య కేసులో గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. నిందితుడుగా ఉన్నవారే అపురూవర్ గా మారే అవకాశం ఉంటుందని అన్నారు.  సాక్షులకు అప్రూవర్ గా మారే అవకాశం ఉండదని తేల్చి చెప్పారు. దస్తగిరి వివేకా హత్య కేసులో నిందితుడుగా ఉండి అప్రువర్గా మారాడని.. అలా మారడాన్ని అప్పుడు జగన్,  సజ్జల అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. దస్తగిరిని జైల్లో పెట్టాలని అన్నారు. అలాగే ఇప్పుడు మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత కూడా.. అప్రూవర్ గా మారిన శరత్ చందారెడ్డిని జైల్లో పెట్టాలని పిటిషన్ దాఖలు చేస్తే..  అతడి అరెస్టు చేస్తారా? అని ప్రశ్నిస్తూ.. చేయరు కదా.. అంటూ  రఘురామా వ్యాఖ్యానించారు. 

click me!