ఫేస్‌బుక్‌తో నాశనమైన బాలిక జీవితం.. రెండేళ్లుగా నిర్బంధించి.. ఆమెపై ..

By Rajesh KarampooriFirst Published Jun 2, 2023, 5:12 AM IST
Highlights

మహారాష్ట్రలోని లాతూర్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన 11 ఏళ్ల బాలికను ఓ వ్యక్తి మయ మాటలు చెప్పి.. తనతో పాటు తీసుకెళ్లి నిర్బంధించాడు. సుమారు రెండేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు పోలీసులు అతడు ఉంటున్న  ప్రాంతాన్ని గుర్తించిన ఆ బాలికను రక్షించారు. 

మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన 11 ఏళ్ల బాలికను ఒక యువకుడు నిర్బంధించాడు. ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా ఏడాదిన్నర పైగా.. అంతటీతో ఆగకుండా.. నిత్యం ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎలాగోలా ఆ కామాంధుడి చాడ తెలుసుకున్న పోలీసులు చివరకు ఆ బాలికను రక్షించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని లాతూర్‌లో జరిగింది.

వివరాల్లోకెళ్తే.. ఔరద్ షాజనీ ప్రాంతానికి చెందిన మనుద్దీన్ బాదురేకు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన 11 ఏళ్ల బాలికతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. దీంతో అతడు గోరఖ్‌పూర్‌కు  వచ్చి కొంత కాలం ఉన్నాడు. ఈ క్రమంలో ఆ బాలికను మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. 2021 డిసెంబర్‌ 24న ఆమెను మభ్యపెట్టి తనతో పాటు మహారాష్ట్రలోని లాతూర్‌కి రప్పించుకున్నాడు. 

సమాచారం ప్రకారం.. బాలిక అదృశ్యమైన వార్త తెలియగానే అందరూ ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఈ సమయంలో అమ్మాయి గదిలో తనిఖీ చేయగా.. ఓ కాగితంపై రెండు ఫోన్ నంబర్లు రాసి ఉండటం గమనించారు. వెంటనే  కుటుంబ సభ్యులు ఆ నంబర్లకు కాల్ చేయగా.. మాట్లాడిన వ్యక్తి తన పేరు షేక్‌ అని తెలిపాడు. తాను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. తమ కుమార్తె తనతోనే ఉందనీ, ఆమె తిరిగి రాదని చెప్పాడు. 

అంతేకాదు..తన కూతురిని మర్చిపోవాలని, లేకుంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని నిందితుడు బాలిక తండ్రిని బెదిరించాడు. నిందితుల బెదిరింపులతో బాలిక కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో యువకుడి ఆచూకీ మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందినదని తేలింది.

రెండేళ్లుగా పోలీసులు అతని కోసం వెతుకుతూనే ఉన్నారు కానీ అతని గురించి , అమ్మాయి గురించి ఏమీ కనుగొనబడలేదు. ఎందుకంటే ఆ తర్వాత నిందితుడు ఆ నంబర్‌ను ఉపయోగించలేదు. మే 29న పోలీసులకు లభించిన రహస్య సమాచారంతో నిందితుల ఆచూకీ తెలుసుకున్నారు. దీని తర్వాత.. లాతూర్‌లోని బాదురే గ్రామానికి చెందిన మైనుద్దీన్ కుమారుడు దస్తగీర్ షేక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దాంతో పాటు అతడి బారి నుంచి బాలిక కూడా విముక్తి పొందింది. షేక్ తనతో రెండేళ్లుగా శారీరక సంబంధాలు పెట్టుకున్నాడని బాలిక చెప్పింది.

బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదే సమయంలో, నిందితుడు యువకుడు గోరఖ్‌పూర్‌లో గతంలో నివసించేవాడని షాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మనోజ్ కుమార్ పాండే తెలిపారు. ఫేస్‌బుక్ ద్వారా మైనర్ బాలికతో స్నేహం చేసి, అక్కడికి తీసుకెళ్లి సంబంధాలు ఏర్పరచుకున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గోరఖ్‌పూర్‌కు తీసుకొచ్చారు. అనే కోణంలో విచారణ సాగుతోంది.

click me!