"డీజీపీ మాత్రమే కాదు.. సీఎం కూడా తాత్కాలికమే.." : అఖిలేష్ యాదవ్

By Rajesh KarampooriFirst Published Jun 2, 2023, 5:44 AM IST
Highlights

ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్‌కు ఉత్తరప్రదేశ్ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బాధ్యతలు అప్పగించడంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు.

ఉత్తరప్రదేశ్ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి విజయ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ ఆర్.కె. విశ్వకర్మ బుధవారం పదవీ విరమణ చేయడంతో  1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్‌కు తాత్కాలిక డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. అప్పటి డిజిపి డిఎస్ చౌహాన్ పదవీ విరమణ చేయడంతో విశ్వకర్మ ఏప్రిల్ 1న రాష్ట్ర అఫిషియేటింగ్ డిజిపిగా బాధ్యతలు స్వీకరించారు. దీనిపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ స్పందించారు.

డిజిపిని పూర్తి స్థాయి నియమించడంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విఫలమయ్యారని ,సీఎం యోగిని "యాక్టింగ్ ముఖ్యమంత్రి" అని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) చీఫ్ అఖిలేష్ యాదవ్  విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ల్యాండ్ మాఫియాగా రూపుదిద్దుకుందని అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీ రాజకీయ నాయకులు యథేచ్ఛగా భూములు ఆక్రమించుకుంటున్నారని, వారికి పరిపాలన సహకరిస్తున్నదని అన్నారు. 

కొత్త పార్లమెంటు భవనంపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించిన రోజున పోలీసులు రెజ్లర్లలను అరెస్టు చేస్తున్నారు. ఈ చర్యతో మేము రాజ్యాంగాన్ని లేదా చట్టాన్ని అనుసరించడం లేదని బిజెపి నేతలు చెప్పకనే చెప్పేశారనీ, ప్రశ్నించే వారి గొంతును బీజేపీ నొక్కుతున్నారు. ఈ దేశంలో డా. భీమ్‌రావ్ అంబేద్కర్ కలలను సాకారం చేసి, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలను పాటించే వారున్నారు. ఈ దేశ ప్రజలకు తెలుసు, వారికి అలా స్వాతంత్ర్యం రాలేదని.. ప్రజలు త్యాగాలు చేశారు. 2024లో బీజేపీని ప్రజలు తుడిచిపెట్టబోతున్నారని హెచ్చరించారు. న్యాయం కోసం ప్రతి వ్యక్తి రోడ్డుపైకి రావాలని బీజేపీ కోరుకుంటోందని, అందుకే అధికారులు ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేస్తున్నారని, బీజేపీ అన్యాయం చేస్తుందని, అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడి ఓటు వేసే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. 

click me!