న్యాయం చేశారు: తెలంగాణ పోలీసులకు రివార్డ్ ప్రకటించిన వ్యాపారవేత్త

Published : Dec 06, 2019, 05:30 PM ISTUpdated : Dec 06, 2019, 09:55 PM IST
న్యాయం చేశారు: తెలంగాణ పోలీసులకు రివార్డ్ ప్రకటించిన వ్యాపారవేత్త

సారాంశం

మిగిలిన రాష్ట్రాల పోలీసులు హైదరాబాద్ పోలీసులను స్ఫూర్తిగా తీసుకోవాలంటూ సూచనలు చేస్తున్నారు. అందరూ ప్రశంసలకు మాత్రమే పరిమితమైతే.. ఓ వ్యక్తి మాత్రం పోలీసులకు రివార్డు కూడా ప్రకటించారు

దిశ హత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో తెలంగాణ పోలీసులపై  దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల పోలీసులు హైదరాబాద్ పోలీసులను స్ఫూర్తిగా తీసుకోవాలంటూ సూచనలు చేస్తున్నారు.

అందరూ ప్రశంసలకు మాత్రమే పరిమితమైతే.. ఓ వ్యక్తి మాత్రం పోలీసులకు రివార్డు కూడా ప్రకటించారు. వివరాల్లోకి వెళితే... హర్యానాకు చెందిన రాహ్ గ్రూప్ ఫౌండేషన్ ఛైర్మన్ నరేశ్ సెల్పార్ దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు తెలుసుకుని హర్షం వ్యక్తం చేశారు.

Also Read:తెలంగాణలో సంచలనం రేపిన ఎన్ కౌంటర్లు ఇవే: సజ్జనార్ కీ రోల్

తెలంగాణ పోలీసుల చర్యను అభినందించిన ఆయన... ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులకు రివార్డు ప్రకటించారు. ఒక్కొక్క పోలీసు అధికారికి రూ.లక్ష చొప్పున రివార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు.

నరేశ్ ప్రకటనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. దిశపై అత్యాచారం , హత్యకు పాల్పడిన నిందితులను శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. 

Also read:Justice For Disha:ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్ వివరణ ఇదీ...

నిందితులు తమపై దాడికి పాల్పడ్డారు,  కాల్పులు కూడ జరిపారు. తమ హెచ్చరికలను కూడ నిందితులు వినలేదు, దీంతో తాము జరిపిన కాల్పుల్లో దిశ రేప్, హత్య కేసులో నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్టుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. 

దిశ సెల్‌ఫోన్, వాచీలను చూపిస్తామని నిందితులు తమకు చెప్పారన్నారు. ఈ వస్తువులను చూపించే క్రమంలోనే తమపై దాడికి పాల్పడి ఆయుధాలను లాక్కొన్నారని సీపీ చెప్పారు. 

Also read:దిశను బూతులు తిడుతూ... నిందితుడి బంధువు షాకింగ్ కామెంట్స్

ఈ సమయంలో పోలీసులు నిందితులను హెచ్చరించినట్టుగా తెలిపారు. కానీ నిందితులు మాత్రం పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలోనే నిందితులపై తాము కాల్పులు జరిపినట్టుగా ఆయన తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Interesting Facts : మనం ఏడ్చినప్పుడు ముక్కు ఎందుకు కారుతుంది..?
UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?