కిటికీలో కొండచిలువ... బహుళ అంతస్తుల అపార్ట్ మెంట్లో షాకింగ్ ఘటన..

Published : Sep 29, 2023, 10:15 AM IST
కిటికీలో కొండచిలువ... బహుళ అంతస్తుల అపార్ట్ మెంట్లో షాకింగ్ ఘటన..

సారాంశం

మహారాష్ట్రలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బహుళ అంతస్తుల అపార్ట్ మెంట్ కిటికిలో ప్రవేశించడానికి ఓ కొండచిలువ ప్రయత్నించింది. గ్రిల్స్ మధ్య ఇరుక్కుపోయింది. 

మహారాష్ట్ర : ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఇళ్లలోకి కొండచిలువలు రావడం  కనిపిస్తుంది. ఆస్ట్రేలియాలోని మారుమూల గ్రామాలు,  పట్టణాల్లో.. అక్కడి అపార్ట్మెంట్లోకి కూడా కొండచిలువలు తరచుగా వస్తూనే ఉంటాయి. దీనికి ఓ కారణమూ ఉంది. మనం పిల్లుల్ని, కుక్కల్ని పెంచుకున్నట్లుగా అక్కడ కొండచిలువలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్నారు.

ఈ కారణంతోనే తమ యజమానుల ఇళ్లల్లో నుండి బయటకు వచ్చిన కొండచిలువలు పొరపాటున వేరే ఇళ్లల్లోకి జొరబడడం..  వ్యక్తుల మీద అటాక్ చేయడం వంటి సంఘటనలు కనిపిస్తుంటాయి. అయితే, తాజాగా ఇలాంటి ఘటన ఒకటి భారత్ లో వెలుగు చూసింది. మన దగ్గర ఏ ప్రాంతంలోనైనా ఇళ్ల మధ్య కొండచిలువ కనిపించడం చాలా అరుదు. ఇక అపార్ట్మెంట్లోకైతే  ఊహించడానికి కూడా వీలు లేదు. కానీ, అలాంటి ఊహించని ఘటనే ఒకటి మన దేశంలోని ఓ అపార్ట్మెంట్లో వెలుగు చూసింది. 

దారుణం.. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందని.. అడవికి తీసుకెళ్లి నిప్పంటించిన కుటుంబ సభ్యులు..
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి  ఓ అపార్ట్మెంట్లోని కిటికీలోకి భారీ కొండచిలువ ప్రవేశించింది.  అయితే, కిటికీ కున్న గ్రిల్స్ నుంచి లోపలికి రావాలని ప్రయత్నించిన దాని ప్రయత్నం ఫలించలేదు. గ్రిల్స్ మధ్య ఇరుక్కుపోయింది. ఇది చూసిన ఇంటివారు షాక్ అయ్యారు. ఇద్దరు వ్యక్తులు దాన్ని రక్షించే ప్రయత్నం చేశారు. కిటికీకి అటూ ఇటూ ఇద్దరు నిలబడి కిటికీలోంచి బయటకు తీయడానికి ఒకరు ప్రయత్నించగా.. గ్రిల్ నుంచి తప్పించడానికి మరొకరు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఎత్తైన అపార్ట్మెంట్ పైనుంచి కొండచిలువ కింద పడిపోయింది. 

కింద పడిపోయిన కొండచిలువ అక్కడ నుంచి జర జరాపాకుతూ నెమ్మదిగా వెళ్లిపోయింది. దీన్నంతా అప్పటికే అక్కడికి చేరిన కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ అయిపోయింది. ఇక కామెంట్ సెక్షన్లో రకరకాల కామెంట్స్ పోటెత్తుతున్నాయి. కొండచిలువను రక్షించడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను కొంతమంది ప్రశంసించగా.. అంత ఎత్తు నుంచి పడిన కొండచిలువకు లోపల గాయాలయి ఉంటాయని.. ఎక్కువ కాలం బతకదని కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు అంత భారీ కొండచిలువ అక్కడికసలు ఎలా వచ్చిందంటూ ఆశ్చర్యపోయారు. 

PREV
click me!

Recommended Stories

మీ దగ్గర ఈ 2 రూపాయల నోటు ఉందా..? అయితే లక్షలాది డబ్బు సొంతం అవుతుందట..!
2026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu