Latest Videos

కావేరీ నదీ జలాల వివాదం: కర్ణాటకలో నేడు కొనసాగుతున్న బంద్, పోలీసుల అదుపులో 50 మంది

By narsimha lodeFirst Published Sep 29, 2023, 10:05 AM IST
Highlights

కావేరీ జలాలను  తమిళనాడుకు విడుదల చేయడాన్ని నిరసిస్తూ  ఇవాళ కర్ణాటకలో బంద్ కొనసాగుతుంది.  50 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బెంగుళూరు: కర్ణాటక బంద్ నేపథ్యంలో  50 మంది ఆందోళనకారులను  పోలీసులు శుక్రవారం నాడు అదుపులోకి తీసుకున్నారు.  కావేరీ నదీ జలాల వివాదం నేపథ్యంలో  ఇవాళ కర్ణాటకలో బంద్ కొనసాగుతుంది.

కర్ణాటకకు కావేరీ జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక ప్రజలు నిరసనకు దిగారు.  రోజు రోజుకు   ఈ ఆందోళనలను ఉధృతం చేశారు నిరసనకారులు.  ఆందోళనలను తీవ్రం చేసే క్రమంలో ఇవాళ  రాష్ట్రబంద్ కు పిలుపు నిచ్చారు.  బంద్ నేపథ్యంలో విద్యా సంస్థలు, ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు.  ఈ బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను  పోలీసులు భారీగా మోహరించారు.కన్నడ చలువళి గ్రూప్ నేతృత్వంలోని కన్నడ అనుకూల సంఘాలు ఇవాళ బంద్ కు పిలుపునిచ్చాయి.

also read:Karnataka Bandh : నేడే కర్ణాటక బంద్.. విద్యాసంస్థలపై ఎఫెక్ట్.. పోలీసుల ముందస్తు జాగ్రత్తలు

కర్ణాటక బంద్ నేపథ్యంలో  సుమారు  50 మంది  ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నామని బెంగుళూరు రూరల్ అదనపు పోలీస్ సూపరింటెండ్ మల్లికార్జున్ బాలదండి మీడియాకు చెప్పారు.బెంగుళూరు కర్ణాటకలోని దక్షిణ ప్రాంతంలో ఈ బంద్ ప్రభావం ఎక్కువగా కన్పించింది.  బెంగుళూరు అర్బన్, మాండ్య, మైసూరులలో  144 సెక్షన్ విధించారు.  మాండ్య సహా కావేరీ పరివాహక జిల్లాల్లో వ్యాపార సంస్థలు మూసివేశారు. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. చిత్రదుర్గలో  తమిళనాడు సీఎం స్టాలిన్ చిత్రపటానికి నిరసనకారులు నిప్పు పెట్టారు.

ఈ బంద్ కు కన్నడ సినీ పరిశ్రమ కూడ మద్దతును ప్రకటించింది.  కర్ణాటక ఫిల్మ్ ఎగ్బిబిటర్స్ అసోసియేషన్ బంద్ కు సంఘీభావం ప్రకటించింది.  రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో సాయంత్రం వరకు  సినిమా ప్రదర్శనలను నిలిపివేశారు.ఐటీ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ చేయాలని ఆయా సంస్థలు ఆదేశించాయి.

నిన్న బెంగుళూరులో  కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు భారీ నిరసనను చేపట్టారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.తమిళనాడుకు  మూడువేల క్యూసెక్కుల నీటిని విడుదలల చేయాలని కావేరీ రెగ్యులేటరీ కమిటీ ఆదేశించడంతో  రైతు కసంఘాలు, కన్నడ అనుకూల సంస్థలు  ఇవాళ కర్ణాటక బంద్ ను చేపట్టాయి.

సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్  15 వరకు  కావేరి నీటిని విడుదల చేయాలని కావేరీ రెగ్యులేటరీ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.ఈ విషయమై సీఎం సిద్దరామయ్య కూడ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ ఆర్డర్ పై  సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటించారు.
 

click me!