
ఆర్జేడీ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం తెల్లవారు జామున ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో ఎయిమ్స్ (AIIMS) నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే మళ్లీ ఒక్క సారిగా ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ ఢిల్లీకి తీసుకెళ్లారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డు (emergency ward)లో జాయిన్ చేశారు.
మంగళవారం మధ్యాహ్నం వరకు రాంచీ (ranchi)లోని రిమ్స్ (RIMS) లో 73 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్ చికిత్స పొందారు. అయితే సాయంత్ర ఒక్క సారిగా ఆయన ఆరోగ్యం విషమించడంతో డాక్టర్లు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించాలని సూచించారు. దీంతో ఆయనను ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ దాదాపు ఢిల్లీ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో రాత్రిపూట పరిశీలనలో ఉంచారు. ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో బుధవారం తెల్లవారు జామున డిశ్చార్జ్ చేశారు. దీంతో ప్రత్యేక విమానంలో రాంచీలోని రిమ్స్కి తిరిగి వెళ్తున్న ఆర్జేడీ నేత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తిరిగి ఢిల్లీకి తీసుకొచ్చారు.
దాణా కుంభకోణం లో, డోరండా ట్రెజరీ నుండి 139 కోట్ల రూపాయలను అపహరించిన కేసులో ఆర్జేడీ అధినేతకు లాలూ ప్రసాద్ యాదవ్ కు ఇటీవలే ఐదేళ్ల జైలు శిక్ష, 60 లక్షల రూపాయల జరిమానాను ప్రత్యేక సీబీఐ కోర్టు విధించింది. కోట్లాది రూపాయల దాణా కుంభకోణంతో పాటు డోరాండా ట్రెజరీ అపహరణ కేసులో దోషిగా తేలిన తరువాత ఆయనను బిర్సా ముండా సెంట్రల్ జైలులో ఉంచారు. అక్కడ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో రిమ్స్‌కు తరలించారు. ఆయన గతేడాది జనవరిలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కూడా చేరారు. దాణా కుంభకోణంలో నాలుగు కేసుల్లో ప్రమేయం ఉన్నందున గతంలో ప్రసాద్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది.