కస్టడీలో వున్న గ్యాంగ్‌స్టర్‌కు పాజిటివ్.. క్వారంటైన్‌కు పోలీసులు

Siva Kodati |  
Published : May 05, 2020, 09:23 PM IST
కస్టడీలో వున్న గ్యాంగ్‌స్టర్‌కు పాజిటివ్.. క్వారంటైన్‌కు పోలీసులు

సారాంశం

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూ 50 వేలను చేరుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. భారత్‌లో సామాన్యులతో మొదలుకుని.. ప్రముఖుల వరకు కరోనా సోకింది

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూ 50 వేలను చేరుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. భారత్‌లో సామాన్యులతో మొదలుకుని.. ప్రముఖుల వరకు కరోనా సోకింది.

Aslo Read:26/11 ఘటనలో కసబ్‌ను గుర్తు పట్టిన హీరో: ప్రస్తుతం ఫుట్‌పాత్‌పై దయనీయ స్ధితిలో

తాజాగా పంజాబ్‌లో ఓ కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌కి కోవిడ్ 19 సోకింది. జగ్గూ భగవాన్‌పూరియాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని బటాలా జిల్లా ఎస్పీ మంగళవారం ప్రకటించారు.

జగ్గూ ఓ హత్య కేసులో ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అయితే ఈ క్రమంలో మే 2వ తేదీన స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కరోనా టెస్టులు చేయగా అతనికి పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు జగ్గూను కలుసుకుని అతనితో కాంటాక్ట్ అయిన వారి ట్రేసింగ్ చేపడుతున్నారు.

Also Read:విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి.. ఛార్జీ ఎంతో తెలుసా

భగవాన్‌పూరియాను ఇంటరాగేట్ చేసే క్రమంలో డీఎస్పీ స్థాయి అధికారులతో పాటు పలువురు పోలీసులు కలిసినట్లు తేలింది. దీంతో వారందరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించి కరోనా టెస్టులు చేస్తున్నారు. మరోవైపు గ్యాంగ్‌స్టార్ జగ్గూకు కరోనా ఎలా సోకిందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే