గుడ్ న్యూస్: ఛత్తీస్‌ఘడ్ బాటలోనే పంజాబ్, లిక్కర్ హోం డెలీవరీ

By narsimha lode  |  First Published May 6, 2020, 4:01 PM IST

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రప్రభుత్వం తరహాలోనే పంజాబ్ రాష్ట్రం కూడ మద్యం ప్రియులకు శుభవార్త చెప్పింది. లిక్కర్ ను హోం డెలీవరీ చేస్తామని ప్రకటించింది. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా హోం డెలీవరి పద్దతిని ప్రవేశపెట్టినట్టుగా ఆ రాష్ట్రం తెలిపింది.
 


ఛండీఘడ్:ఛత్తీస్ ఘడ్ రాష్ట్రప్రభుత్వం తరహాలోనే పంజాబ్ రాష్ట్రం కూడ మద్యం ప్రియులకు శుభవార్త చెప్పింది. లిక్కర్ ను హోం డెలీవరీ చేస్తామని ప్రకటించింది. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా హోం డెలీవరి పద్దతిని ప్రవేశపెట్టినట్టుగా ఆ రాష్ట్రం తెలిపింది.

also read:మద్యం ప్రియులకు బంపరాఫర్: లిక్కర్ డోర్ డెలీవరి

Latest Videos

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం కూడ మద్యం హోం డెలీవరీని ప్రారంభించింది. లిక్కర్ షాపుల వద్ద ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకే విక్రయాలు సాగుతాయి.మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యాన్ని హోం డెలీవరీ చేయనున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని పంజాబ్ సర్కార్ బుధవారం నాడు హెచ్చరించింది.

హోం డెలీవరీ చేసేందుకు పాసులు జారీ చేస్తారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది హోం డెలీవరీ చేయకుండా అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.ఒక్క ఇంటికి రెండు లీటర్ల కంటే ఎక్కువ మద్యం విక్రయించకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ శాఖ ఇచ్చిన వాహనంపైనే డెలీవరీ ప్రయాణం చేయాలని ప్రభుత్వం సూచించింది.

మద్యం దుకాణం వద్ద ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడ ఉండాలని పంజాబ్ ప్రభుత్వం ఆదేశించింది. అయినా కూడ గుంపులు గుంపులుగా జనం మద్యం దుకాణాల వద్దకు చేరుకోవడంతో ఆన్ లైన్ లోమద్యం  విక్రయాలు జరపాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

click me!