భౌతిక దూరం పాటిస్తూ విమానాలు, నౌకల్లో విదేశాల్లో ఉన్న భారతీయులను ఇండియాకు తీసుకువస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుండి భారతీయులను దేశానికి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు.
న్యూఢిల్లీ: భౌతిక దూరం పాటిస్తూ విమానాలు, నౌకల్లో విదేశాల్లో ఉన్న భారతీయులను ఇండియాకు తీసుకువస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుండి భారతీయులను దేశానికి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు.
బుధవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇండియాకు రావాలనుకొనేవారు తొలుత పరీక్షలు చేయించుకొని కరోనా లేదని సర్టిఫికెట్లు చూపాల్సి ఉంటుందన్నారు. విదేశాల నుండి వచ్చినవారంతా 14 రోజులపాటు హోం క్వారంటైన్ లో ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: ముంబై నుండి స్వగ్రామానికి కాలినడకన గర్భిణీ
ప్రాధాన్యత క్రమంలోనే విదేశాల నుండి విమానాలు, నౌకల ద్వారా ఇండియన్లను తీసుకొస్తామన్నారు. ప్రతి విమానం 200 నుండి 300 మందిని మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణించేలా చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆయన వివరించారు. నౌకల్లో కూడ ఇదే రకమైన పద్దతులను అవలంభిస్తున్నామన్నారు.
ఇండియాకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నామని 1.90 లక్షల మంది భారతీయులు ధరఖాస్తు చేసుకొన్నట్టుగా ఆయన వివరించారు. ఈ నెల 7వ తేదీన తొలివిడతగా విమానాలు, నౌకలు బారతీయులను రప్పించేందుకు చర్యలు తీసుకొంటున్నట్టుగా తెలిపారు.విదేశాల్లో ఉన్న 14800 మందిని ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మొదటి గల్ఫ్ యుద్ధం తర్వాత విదేశాల్లో ఉన్న భారతీయులను తరలించడం ఇదే మొదటిసారి అని ఆయన గుర్తు చేశారు.
విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని ఈ క్రింది ప్రాధాన్య క్రమంలో భారత్ కు తరలిస్తాం. ఆయా దేశాల నుండి వెలివేయబడినవారు, వీసా గడువు ముగిసినవారు, వలస కార్మికులు, ఆరోగ్య రీత్యా ఇండియాలో అత్యవసర చికిత్స అవసరమైన వారు, గర్భిణీ స్త్రీలు, భారత్ లో చనిపోయిన బంధువులు ఉన్నవారు, ఆయా దేశాల్లో చిక్కుకొన్న పర్యాటకులు, విదేశాల్లో హాస్టల్స్ మూతపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులను ఇండియాకు రప్పిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
మొదటి దశలో వాయు మార్గాన 13 దేశాలనుండి 14,800 మందిభారతీయులను 64 విమానాల్లో భారత్ కు తీసుకురానున్నాం. మొదటి దశలో అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఫిలిప్పీన్స్, బాంగ్లాదేశ్, యుకె, యు ఏ ఈ, సౌదీ, ఖతార్, ఒమాన్, బహ్రెయిన్ వంటి 12 దేశాలకు భారత విమానాలు చేరుకొని అక్కడున్న భారతీయులను తిరిగి తీసుకువస్తాయని మంత్రి తెలిపారు.