లాక్‌డౌన్ ఉల్లంఘన: ప్రశ్నించిన పోలీసులపై కత్తులతో దాడి

By narsimha lode  |  First Published Apr 12, 2020, 2:33 PM IST

పంజాబ్ రాష్ట్రంలోని పాటియాల జిల్లాలో ఆదివారంనాడు ఉదయం కొందరు దాడి చేయడంతో ఓ ఎస్ఐతో పాటు మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.


పంజాబ్: పంజాబ్ రాష్ట్రంలోని పాటియాల జిల్లాలో ఆదివారంనాడు ఉదయం కొందరు దాడి చేయడంతో ఓ ఎస్ఐతో పాటు మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

లాక్‌డౌన్ కారణంగా వాహనాలు తిరగకుండా పోలీసులు రోడ్లపై బారికేడ్లు పెట్టారు. బారికేడ్లను ఢీకొడుతూ  వాహనం ముందుకు వెళ్లింది. ఈ విషయాన్ని ప్రశ్నించిన పోలీసులను ఓ వ్యక్తి కత్తితో దాడికి దిగాడు. 

Latest Videos

undefined

ఈ ఘటనలో  ఎస్ఐ హర్జీత్ సింగ్  గాయపడ్డాడు.అతడిని ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు పోలీసులు కూడ గాయపడ్డారు. ఆదివారం నాడు ఉదయం ఆరు గంటల సమయంలో  కూరగాయల మార్కెట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.

also read:ఇండియాలో 24 గంటల్లో 909 కరోనా కొత్త కేసులు, మొత్తం 8356కి చేరిక

పోలీసులపై దాడి చేసిన వారు పారిపోయారు. దాడి చేసిన వారిని లొంగిపోవాలని పోలీసులు కోరారు. స్థానిక పెద్దలు, సర్పంచ్ ద్వారా ఓ ప్రార్ధన మందిరంలో దాక్కొన్న నిందితులు పోలీసులు లొంగిపోయారు.ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురిని  అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. 

కరోనాను నివారించేందుకు గాను లాక్ డౌన్ ను పొడిగిస్తూ  పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ శుక్రవారం నాడు నిర్ణయం తీసుకొన్నారు. దేశంలో ఇప్పటికే ఒడిశా, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాయి. పంజాబ్ రాష్ట్రంలో 151 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 11 మంది మరణించారు.


 

click me!