
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ఢిల్లీలోని అపోలో హాస్పిటల్ లో చేరారు. సీఎం కడుపునొప్పి నొప్పితో బాధపడగా డాక్టర్లు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఇన్ఫెక్షన్ సోకిందని నిర్ధారించి ఆయనను అడ్మిట్ చేసుకున్నారని వార్తా సంస్థ ANI నివేదించింది.
సిద్దూ మూస్ వాలా హత్య కేసులో ఇద్దరు అనుమానితులను పంజాబ్ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసింది. అయితే రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్లకు వ్యతిరేకంగా ఆపరేషన్ విజయవంతంగా అమలు చేసినందుకు పోలీసులను, యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్‌ను భగవంత్ మాన్ బుధవారం అభినందించారు. హతమైన గ్యాంగ్‌స్టర్లను జగ్రూప్ సింగ్ రూప, మన్‌ప్రీత్ సింగ్‌లుగా గుర్తించారు, వీరి నుండి ఒక ఏకే 47, పిస్టల్‌ను ఎన్‌కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో పిడుగుపాటుకు 14 మంది దుర్మరణం.. రూ. 4 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం యోగి
రాష్ట్రంలోని గ్యాంగ్‌స్టర్లు, సంఘ వ్యతిరేక శక్తులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాత్మక యుద్ధాన్ని ప్రారంభించిందని, నిబద్ధత ప్రకారం పంజాబ్ పోలీసులు వ్యతిరేక చర్యలో పెద్ద విజయం సాధించారని సీఎం ఆఫీసు నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో భగవంత్ మాన్ పేర్కొన్నారు. కాగా ఈ నెల 7వ తేదీన మాన్ డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు.
దేశ చరిత్రలోనే అత్యంత అన్‌పార్లమెంటరీ సర్కారు.. : మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్
గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరుఫున ఎంపీగా పని చేసిన భగవంత్ మాన్ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగానే ఆయన బరిలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించి ఆప్ ఘన విజయం సాధించింది. 92 సీట్లు గెలిచి భారీ మెజారిటీని కైవసం చేసుకుంది. దీంతో ఏ పార్టీ మద్దతు లేకుండా సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో మార్చి 16వ తేదీన ఆయన పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది.