దేశ చ‌రిత్ర‌లోనే అత్యంత అన్‌పార్ల‌మెంట‌రీ సర్కారు.. : మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్

Published : Jul 21, 2022, 09:49 AM IST
దేశ చ‌రిత్ర‌లోనే అత్యంత అన్‌పార్ల‌మెంట‌రీ సర్కారు.. : మోడీ  ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్

సారాంశం

Congress: ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు వాడివేడిగా జ‌రుగుతున్నాయి. అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ),  ప్ర‌తిప‌క్ష పార్టీల నాయకుల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది.   

Parliament Monsoon Session:  సోమ‌వారం నుంచి పార్ల‌మెంట్ వ‌ర్ష‌కాల స‌మావేశాలు ప్ర‌రంభం అయ్యాయి. ఇప్ప‌టికే అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ), ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ స‌హా ఇత‌ర పార్టీలన్నీ పార్ల‌మెంట్ లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌తో చ‌ర్చించుకునీ, దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌ర్కారు పెద్ద‌మొత్తంలో బిల్లులు తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ స‌హా ఇత‌ర ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్ని పెరుగుతున్న ధ‌ర‌లు, ప్ర‌జ‌ల పై ఆర్థిక భారం వంటి అనేక ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అలాగే, కేంద్రంలోని మోడీ స‌ర్కారుపై ప్ర‌తిప‌క్ష పార్టీలు తీవ్ర ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నాయి. భార‌త దేశ చ‌రిత్రలోనే అత్యంత అన్‌పార్ల‌మెంట‌రీ స‌ర్కారు ప్ర‌స్తుతం కేంద్రంలో కొన‌సాగుతున్న‌ద‌ని ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నాయి. 

పార్లమెంటుకు అంతరాయం కలిగిస్తుండగా, సమస్యలపై చర్చకు ప్రతిపక్షాల డిమాండ్‌ను అంగీకరించకుండా ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రభుత్వం అన్ని వ్యవహారాలను నిలిపివేసి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చర్చకు అంగీకరించాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. భారత చరిత్రలోనే అత్యంత ‘అన్‌పార్లమెంటరీ’ ప్రభుత్వం కొన‌సాగుతున్న‌ద‌ని ఆరోపించారు. సామాన్యులపై ఆర్థిక భారం.. ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువులపై జీఎస్టీపై చర్చకు అనుమతించడం లేదు. మోడీజీ, మీ వైఫల్యాలకు సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోతున్నారంటూ ప్ర‌శ్నించారు. 

కాంగ్రెస్, టీఆర్‌ఎస్ స‌హా అనేక ప్ర‌తిపక్ష పార్టీలు క‌లిసి ముందుకు సాగ‌డంతో ఈ మొదటి వారంలో జ‌రుగుతున్న‌ వర్షాకాల సమావేశాలు సాధారణంగా జరిగే అవకాశాలు మసకబారుతాయని సూచ‌న‌ల క్ర‌మంలో  ఉమ్మడి ప్రతిపక్షం  బుధ‌వారం ఉద‌యం కార్యకలాపాలకు ముందే పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ధర్నా నిర్వహించింది. కాంగ్రెస్ జీఎస్టీని "గ్రహస్తి సర్వనాష్ ట్యాక్స్"గా అభివర్ణించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రశ్నించడానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేడు (రువారం) ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ముందు హాజ‌రుకారుకానున్నారు. ఇదివ‌ర‌కే రాహుల్ గాంధీని 50 గంట‌ల‌కు పైగా విచార‌ణ జ‌రిపింది. ఈ క్ర‌మంలోనే కేంద్రంలోని ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారు.. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల దుర్వినియోగానికి పాల్ప‌డుతున్న‌ద‌ని ఆరోపించింది. ఏజెన్సీల దుర్వినియోగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలను ప్లాన్ చేయ‌డంతో రాజ‌కీయాలు మ‌రింత‌గా హీటెక్కాయి. 

ఏఐసీసీ ప్రతినిధులు, మేనేజర్లు, ఎంపీలు, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖర్గే నివాసంలో సమావేశమై అనుస‌రించాల్సిన వ్యూహాలు, ప్రణాళికపై చర్చించారు. ‘రేపు మన అగ్రనాయకత్వంపై మోడీ-షా ద్వయం సాగిస్తున్న రాజకీయ ప్రతీకారం కొనసాగుతుండగా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం సోనియా గాంధీకి సామూహిక సంఘీభావాన్ని తెలియజేస్తుంది’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ఆహార వస్తువులపై GSTని ఆర్థిక మంత్రి సమర్థించడాన్ని ప్రశ్నిస్తూ రమేష్ ట్వీట్ చేస్తూ.. "'బ్రాండెడ్ & లేబుల్' అనేది 'ప్రీ-ప్యాకేజ్డ్ & లేబుల్డ్' కంటే చాలా భిన్నంగా ఉంటుంది. మునుపటిది ఎక్కువ ధర ఉన్న, మధ్య-ఎగువ మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే పెద్ద కంపెనీల ఉత్పత్తులపై మాత్రమే ప్రభావం చూపుతుంది. రెండోది దిగువ మధ్యతరగతి & పేదలు కొనుగోలు చేసే చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపుతుంది. పేదల ఆకాంక్షలను ప్రభుత్వం కాలరాస్తోందని" ఆరోపించారు.
శ్మశాన వాటికలపై జీఎస్టీని పెంచిన విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?