300 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీంకు పంజాబ్ కేబినేట్ ఆమోదం..

Published : Jul 06, 2022, 03:44 PM IST
300 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీంకు పంజాబ్ కేబినేట్ ఆమోదం..

సారాంశం

పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల హామీని నెరవేర్చడంలో ఓ ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రజలకు నెలకు 300 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చే ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 

రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బుధవారం తెలిపారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న వెల్ల‌డించారు. “ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని పంజాబ్ ప్రజలకు మేము పెద్ద హామీ ఇచ్చాం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేడు మంత్రివ‌ర్గం ఆమోదించింది.’’ అని ఆయన తెలిపారు. 

రాహుల్ గాంధీ వీడియో కేసు: పరారీలో న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్

పంజాబ్‌ ప్రజలకు ఇచ్చిన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామ‌ని చెప్పారు. రెండు నెలల్లో 600 యూనిట్లు దాటితే ప్రజలు పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంద‌ని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ, వెనుకబడిన కులాలు, షెడ్యూల్డ్ కులాలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల‌కు 600 యూనిట్లకు పైగా విద్యుత్ వాడితే, పైన ఉప‌యోగించుకున్న యూనిట్ ల‌కు మాత్ర‌మే ఛార్జీలు వేస్తామ‌ని పేర్కొన్నారు. 

నూపుర్ శర్మకు ఫేస్ బుక్ లో మద్దతు.. యువకుడిపై 20 మంది దాడి.. బీహార్ లో ఘటన

పంజాబ్ లో ఈ ఉచిత విద్యుత్ పథకం వ‌ల్ల రాష్ట్రంలోని 80 శాతం గృహ కేటగిరీ విద్యుత్ వినియోగదారులకు ప్రయోజనం చేకూర‌నుంది. రాష్ట్రంలో SC, BC, BPL కుటుంబాలు, స్వాతంత్ర సమరయోధుల నుండి దాదాపు 21 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. ప్రస్తుతం నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందుతున్నారు. ఇకపై ప్రతీ నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందనుంది.

ప్ర‌స్తుతం పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ  ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత విద్యుత్ హామీ ఇచ్చింది (ఢిల్లీలో, ఉత్తరాఖండ్, గోవా ఎన్నికల్లో కూడా ఇదే హామీ ఇచ్చింది). అయితే ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఉచిత యూనిట్లు నెలవారీ అని స్పష్టం చేయలేదు. ఎందుకంటే పంజాబ్‌లో రెండు నెలల బిల్లింగ్ సైకిల్ ఉంది. కేజ్రీవాల్ తన పార్టీ కోసం ప్రచారం చేస్తున్నప్పుడు, సుదీర్ఘ విద్యుత్ కోతలు,  పెంచిన బిల్లులపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడి చేశారు, రాష్ట్రంలో అదనపు విద్యుత్ ఉన్నందున, దానిని ప్రజలకు సరఫరా చేయడం సమస్య కాద‌ని వాదించారు.

PREV
click me!

Recommended Stories

Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100 వేలు..!
Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే