నూపుర్ శర్మకు ఫేస్ బుక్ లో మద్దతు.. యువకుడిపై 20 మంది దాడి.. బీహార్ లో ఘటన

By team teluguFirst Published Jul 6, 2022, 2:57 PM IST
Highlights

నూపుర్ శర్మకు మద్దతు ప్రకటించిన వారిపై ఇటీవల దాడులు పెరుగుతున్నాయి. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య  లాల్, మహారాష్ట్రలోని అమరావతి ఫార్మసిస్టు ఉమేష్ కొల్హే లు హత్యకు గురయ్యారు. ఇవి మరవక ముందే బీహార్ లోని ఓ యువకుడిపై 20 మంది దాడి చేశారు. 

బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నూపుర్ శర్మకు మద్దతు ప్రకటిస్తూ, ఆమెను ప్ర‌శంసిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టిన ఓ యువ‌కుడిపై 20 మంది దాడి చేశారు. ఈ ఘ‌ట‌న బీహార్ లో చోటు చేసుకుంది. భోజ్ పూర్ జిల్లాలోని ఒక టీ స్టాల్ వద్ద దీపక్, రయీస్ అనే ఇద్దరు యువకులు మ‌హమ్మద్ ప్రవక్తపై నూపుర్ శ‌ర్మ చేసిన ఈ వ్యాఖ్యలకు మద్దతుగా ఫేస్ బుక్ లో త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 

18 రోజుల్లో 8 విమానాల్లో సాంకేతిక లోపాలు.. స్పైస్‌జెట్‌పై డీజీసీఏ ఆగ్రహం, షోకాజ్ నోటీసులు జారీ

Latest Videos

స‌స్పెండ్ కు గురైన శ‌ర్మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌వద్ద‌ని దీపక్ రయీస్ ను కోరారు. దీంతో వారి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రయీస్ త‌న‌కు స‌హ‌చ‌రుల‌ను కొంద‌రిని అక్క‌డికి పిలిపించుకొని దీప‌క్ ను చిత‌క‌బాదారు. కాగా.. కొంత కాలం కిందట ఓ టీవీ చ‌ర్చ‌లో మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ అధికార ప్ర‌తినిధి నుపూర్ శ‌ర్మ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. ఇవి దేశమంతా దుమారాన్ని రేపాయి. ప్ర‌పంచ‌లోని అనేక గ‌ల్ప్ దేశాలు కూగా ఈ వ్యాఖ్య‌ల‌ను ఖండించాయి. ఆయా దేశాల్లో ఉంటున్న భార‌త రాయభారుల‌ను పిలిపించుకొని వివ‌ర‌ణ అడిగాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర‌స‌న‌లు వ్య‌క్తం అయ్యాయి. ఇవి హింసాత్మ‌కంగా మారాయి. త‌రువాత ఈ ఆందోళ‌న‌లు కొంత చ‌ల్ల‌బ‌డ్డాయి. అయితే ఇటీవ‌ల రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో క‌న్హ‌య్య లాల్ అనే టైల‌ర్ నుపూర్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. దీంతో అత‌డిని దారుణంగా హ‌త్య చేశారు. అనంత‌రం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను కూడా విడుద‌ల చేశారు. ఇస్లాంను అవ‌మానించినందుకు ఇలా చేశామ‌ని అందులో పేర్కొన్నారు. 

సీఎం ఇంట రేపు పెళ్లి సందడి.. రెండో పెళ్లి చేసుకోబోతున్న భగవంత్ మాన్.. వధువు ఎవరంటే?

ఈ ఘ‌ట‌నను దేశం మ‌ర‌వ‌క ముందే మ‌హారాష్ట్రలోని అమ‌రావ‌తిలో మ‌రో ఘ‌ట‌న వెలుగు చూసింది. వెటర్న‌రీ ఫార్మ‌సిస్టుగా ప‌ని చేసే ఉమేష్ కోల్హే జూన్ 21వ తేదీన హ‌త్య‌కు గుర‌య్యాడు. ఆయ‌న కూడా అంత‌కు ముందు నూపుర్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతోనే అత‌డిని చంపేశార‌ని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కన్హయ్య లాల్, ఉమేష్ కొల్హే హత్య కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేపట్టింది. 

Dalai Lama birthday: దలైలామా 87వ పుట్టినరోజు.. ప్రధాని మోడీ శుభాకాంక్షలు

అమ‌రావ‌తి హత్య కేసులో ముద్దసర్ అహ్మద్ (22), షారుక్ పఠాన్ (25), అబ్దుల్ తౌఫిక్ (24), షోయబ్ ఖాన్ (22), అతిబ్ రషీద్ (22), యూసుఫ్ ఖాన్ (32)లతో పాటు సూత్రధారి షేక్ ఇర్ఫాన్ షేక్ రహీమ్ (32)లను అరెస్టు చేశారు. ఉదయ్ పూర్ హత్య కేసులో ప్రధాన నిందితులు రియాజ్ అఖ్తరి, గౌస్ మహ్మద్ ను అరెస్టు చేశారు. ఆ తర్వాత టైలర్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై జూన్ 30న మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 

click me!