కరోనా వైరస్ సంక్రమణతో మరణించిన తన తండ్రి మృతదేహం వెంట సూరజ్‌కుండ్ శ్మశానవాటికకు చేరుకున్న బిజెపి నాయకుడు విభన్షు వశిష్ఠ పండితుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చిందని పోలీసులు తెలిపారు.
కరోనా మహ్మమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. మన దేశంలోనూ ఈ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కాగా.. తాజాగా ఓ బీజేపీ నేత తండ్రి ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. అతని అంత్యక్రియలకు కనసం ఒక్క పూజారి కూడా ముందుకు రాలేదు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... మీరట్ కి చెందిన స్థానిక బీజేపీ నేత విభన్షు తండ్రికి ఇటీవల కరోనా సోకగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కాగా... బీజేపీ నేత తండ్రి అంత్యక్రియలు చేయడానికి పండితులు నిరాకరించారు. తమకు మాస్కులు లేవని, తమ ప్రాణాలను పణంగా పెట్టబోమనివారు తేగేసి చెప్పారు.
కరోనా వైరస్ సంక్రమణతో మరణించిన తన తండ్రి మృతదేహం వెంట సూరజ్‌కుండ్ శ్మశానవాటికకు చేరుకున్న బిజెపి నాయకుడు విభన్షు వశిష్ఠ పండితుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు శ్మశానవాటికకు చేరుకోగా, ఆ పండితులు తమ వద్ద శానిటైజర్, మాస్క్, గ్లౌజులు కూడా లేవని చెప్పారు.
అటువంటి పరిస్థితిలో ఈ అంత్యక్రియలు చేయలేమని తెలిపారు. అయితే పోలీసులు కోరిన మీదట పండిట్ రవిశర్మ, నిశాంత్ శర్మ సరైన దూరంలో ఉంటూ కర్మకాండలు జరిపించారు.