"నేను స్వర్గంలో ఉంటా": జవాన్లపై దాడి చేసిన ఉగ్రవాది చివరి మాటలు

Siva Kodati |  
Published : Feb 14, 2019, 08:38 PM IST
"నేను స్వర్గంలో ఉంటా": జవాన్లపై దాడి చేసిన ఉగ్రవాది చివరి మాటలు

సారాంశం

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది చివరి వీడియోను జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ విడుదల చేసింది. దాడికి పాల్పడిన ముష్కరుడి పేరు అదిల్ అహ్మద్.. సదరు వీడియోలో జైషే సంస్థ జెండా ముందు అదిల్ ఆటోమెటిక్ రైఫిల్స్‌ను తగిలించుకుని కనిపిస్తాడు. 

‘‘ ఈ వీడియో మీరు చూసేసరికి... తాను స్వర్గంలో ఉంటానని... జైషేలే మిలిటెంట్‌గా ఏడాది పాటు ఉన్నానని, కశ్మీరీ ప్రజలకు తానిచ్చే చివరి సందేశం ఇదేనన్నాడు. దక్షిణ కశ్మీర్ ప్రజలు భారత్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని, ఇక ఉత్తర, మధ్య కశ్మీరీలతో పాటు జమ్ము ప్రజలు కూడా తమతో చేరాల్సిన సమయం వచ్చిందని జనానికి పిలుపునిచ్చాడు.

అలాగే తమ సంస్థకు చెందిన ఉగ్రవాదులను కొంతమందిని చంపినంత మాత్రాన తాము బలహీనపడిపోతామని అనుకోవద్దని’’ అదిల్ హెచ్చరిస్తున్నట్లుగా ఈ వీడియోలో ఉంది. అదిల్ అహ్మద్ పుల్వామా ప్రాంతానికి చెందిన వ్యక్తి.. 2016, మార్చి 19 నుంచి అదిల్‌తో పాటు అతడి ఇద్దరు స్నేహితులు టౌసిఫ్, వసీమ్ కనిపించడం లేదని అక్కడి పోలీసులు తెలిపారు.

జమ్మూ కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడి... 350 కిలోల పేలుడు పదార్థాలతో

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి తెగబడిన ముష్కరులు..20మంది ఆర్మీ జవాన్ల మృతి

PREV
click me!

Recommended Stories

38 మందికి మరణ శిక్ష గుజరాత్ హై కోర్ట్ సంచలన తీర్పు | Historic Verdict in 2008 Ahmedabad Incident
ఇండోనేషియాలో ప్రంబనన్ ఆలయందర్శించిన మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | PM Narendra Modi Prambanan Temple Visit