వాలంటైన్స్ డే: స్టేజ్‌పై రాహుల్‌ను లాక్కొని ముద్దు పెట్టుకున్న మహిళ..

Siva Kodati |  
Published : Feb 14, 2019, 05:24 PM ISTUpdated : Feb 14, 2019, 05:30 PM IST
వాలంటైన్స్ డే: స్టేజ్‌పై రాహుల్‌ను లాక్కొని ముద్దు పెట్టుకున్న మహిళ..

సారాంశం

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వింత అనుభవం ఎదురైంది. స్టేజ్‌పైనే అందరి ముందు ఓ మహిళా కార్యకర్త ఆయనకు ముద్దు పెట్టింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని వల్సాద్‌లో ఏర్పాటు చేసిన జాతీయ సేవా దళ్ సదస్సుకు రాహుల్ హాజరయ్యారు.

అక్కడ వేదికపై కొందరు మహిళా నేతలు, కార్యకర్తలు ఆయనకు పూలమాల వేయడానికి వచ్చారు. అందులో ఓ మహిళ రాహుల్‌ను చూసిన ఆనందంలో ఆయన బుగ్గపై ముద్దుపెట్టారు. ఊహించని ఈ చర్యతో ఆయన ఒక్క నిమిషం షాక్‌‌కు గురైనా.. ఆ తర్వాత వెంటనే తేరుకుని నవ్వులు చిందించారు.

కానీ పక్కనే ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మాత్రం షాక్‌లోంచి వెంటనే బయటకు రాలేకపోయారు. దీనికి సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గతంలో అసోమ్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీని కొందరు మహిళలు ముద్దుపెట్టుకోవడం అప్పట్లో సంచలనం కలిగించింది. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం