పుల్వామా ఎన్ కౌంటర్.. కాశ్మీరీ పండిత్ సంజయ్ శర్మను చంపిన ఉగ్రవాది హతం

Published : Feb 28, 2023, 02:57 PM IST
పుల్వామా ఎన్ కౌంటర్.. కాశ్మీరీ పండిత్ సంజయ్ శర్మను చంపిన ఉగ్రవాది హతం

సారాంశం

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో నేటి తెల్లవారుజామున భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు కాల్పులు జరిగాయి. అయితే ఇందులో ఇద్దరు జవాన్లకు గాయాలు అయ్యాయి. కాగా.. సంచలనం రేపిన కాశ్మీరీ పండిత్ సంజయ్ శర్మను హతమార్చిన ఉగ్రవాది ఈ కాల్పుల్లో చనిపోయాడు. 

దక్షిణ కశ్మీర్ లోని పుల్వామాలోని అవంతిపొరా ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్ లో కాశ్మీరీ పండిట్ సంజయ్ శర్మను చంపిన టీఆర్ఎఫ్ మిలిటెంట్ హతమయ్యాడు. ఈ విషయాన్ని కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు. పుల్వామాలోని పడ్గంపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఈ తెల్లవారుజామున బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా కాల్పులు జరిగాయి. ఇందులో స్థానిక టీఆర్ఎఫ్ మిలిటెంట్ హతమయ్యాడు.

ఉల్లిగడ్డల దండలతో అసెంబ్లీకి ఎన్సీపీ ఎమ్మెల్యేలు.. టోకు ధరల కోసం నిరసనలు

హతమైన ఉగ్రవాదిని పుల్వామాకు చెందిన అఖిబ్ ముస్తాక్ భట్ గా గుర్తించామని కాశ్మీర్ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. అతడు పండిట్ సంజయ్ శర్మను హత్యలో ప్రధాన నిందితుడు అని పేర్కొన్నారు. అఖిబ్ ఏ కేటగిరీ ఉగ్రవాది అని, మొదట్లో హిజ్బుల్ ముజాహిదీన్ లో పని చేశాడని, కానీ ప్రస్తుతం టీఆర్ఎఫ్ లో పనిచేస్తున్నాడని ఏడీజీపీ చెప్పారు.

పుల్వామాలోని అచెన్ గ్రామంలో ఆదివారం ఉదయం ముగ్గురు పిల్లల తండ్రి అయిన సంజయ్ శర్మ స్థానిక మార్కెట్ కు వెళ్తుండగా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆయన హత్యపై తీవ్ర దుమారం రేగింది. ఈ హత్యను స్థానికులు తీవ్రంగా ఖండించారు. ఆయన మృతదేహానికి దహన సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఎయిర్ ఇండియా విమాన భోజనంలో పురుగు.. మండిపడ్డ ప్యాసింజర్.. స్పందించిన విమానయాన సంస్థ

ఆయన మరణంపై రాజకీయ నాయకులు కూడా స్పందించారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఓ ట్వీట్ చేస్తూ.. సంజయ్ పండిత్ మరణవార్త విని చాలా బాధపడ్డానని తెలిపారు. ‘‘సంజయ్ బ్యాంక్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈరోజు తెల్లవారుజామున ఉగ్రవాదుల దాడిలో చనిపోయాడు. ఈ దాడిని నేను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాను. అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu