అప్పుడే పుట్టిన పసికందుని పాము కాపాడింది..!

Published : Feb 28, 2023, 02:30 PM IST
అప్పుడే పుట్టిన పసికందుని పాము కాపాడింది..!

సారాంశం

అప్పుడే పుట్టిన ఓ మగ బిడ్డ... ఎండిపోయిన ఓ బావిలో పడిపోయింది. దాదాపు 20 గంటలపాటు ఆ బిడ్డ బావిలో ఉండటం గమనార్హం.

అప్పుడే పుట్టిన పసికందును ఓ పాము రక్షించింది. ఈ విచిత్ర సంఘటన  ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అప్పుడే పుట్టిన ఓ మగ బిడ్డ... ఎండిపోయిన ఓ బావిలో పడిపోయింది. దాదాపు 20 గంటలపాటు ఆ బిడ్డ బావిలో ఉండటం గమనార్హం.

బావిలో నుంచి బిడ్డ ఏడుపు విన్న స్థానికులు ప్రేమ్ రాజ్(50), భార్య సోమవతి దేవి(48) వెంటనే... బావిలో నుంచి బిడ్డను బయటకు తీశారు. అయితే... ఆ బిడ్డను బయటకు తీస్తున్నప్పుడు పక్కనే ఓ విష సర్పం ఉండటం గమనార్హం. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

పాము బాబు పక్కనే ఉన్నా... ఆ బిడ్డను ఏం చేయకపోవడం గమనార్హం. పైగా పాముకి రక్షకుడిలాగా ఆ పాము అక్కడ ఉందని స్థానికులు చెబుతున్నారు. పామే స్వయంగా ఆ బిడ్డను రక్షించిందని స్థానికులు చెబుతున్నారు. బిడ్డను కాపాడిన వారు... ఆ బాబుని స్థానికంగా ఉన్న ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే.. ఆ బిడ్డను అక్కడ ఎవరు వదిలేశారు అనే విషయం మాత్రం తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం