
పుల్వామా ఉగ్రదాడి ఘటన జరిగి ఏళ్లు గడుస్తున్నా .. అమరవీరుల కుటుంబాలకు నేటికి న్యాయం జరగకపోవడం దురదృష్టకరం. తాజాగా తమకు న్యాయం చేయాలంటూ అమర జవాన్ల భార్యలు ఆందోళనకు సిద్ధమయ్యారు. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు అమరవీరుల భార్యలు ఆదివారం గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలిశారు. తమకు ప్రభుత్వం అన్ని విధాలుగా వుంటామని హామీ ఇచ్చిందని.. కానీ ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని వారు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం నుంచి సాయం లభించనప్పుడు.. కనీసం తమకు ఆత్మహత్య చేసుకునేందుకైనా అనుమతివ్వాలని వారు గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం, దాడి ఘటనలో అమరులైన తమ భర్తల పేరిట స్మారకాలు నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని వారు తెలిపారు.
Also REad: Pulwama Terror Attack: 2019 ఫిబ్రవరి 14న ఏం జరిగింది? దాడి తర్వాత పరిణామాలేమిటీ?
కాగా.. 2019 ఫిబ్రవరి 14. భారత చరిత్రలో ఒక విషాద దినంగా నిలిచింది. సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)లపై ఆత్మాహుతి దాడి జరిగింది. జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఈ ఉగ్ర దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. అందుకే ఫిబ్రవరి 14వ తేదీన బ్లాక్ డేగా పాటిస్తున్నారు. ఈ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. మిలిటరీ దాడులు జరిగాయి.