వృద్ధుల సంక్షేమ పథకాలపై సమాచారం ఇవ్వండి - రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు సుప్రీంకోర్టు ఆదేశం

By team teluguFirst Published Oct 6, 2022, 4:40 PM IST
Highlights

అన్ని రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వృద్ధుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఇతర వివరాలను అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లోగా వీటిని సమర్పించాలని పేర్కొంది. 

వృద్ధుల కోసం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, వారి కోసం అందుబాటులో ఉన్న వృద్ధాశ్రమాలు, వృద్ధుల సంరక్షణ నిల‌యాలు, వారికి అందుతున్న పెన్ష‌న్ కు సంబంధించిన వివ‌రాలు అందించాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను. కేంద్ర పాలిత ప్రాంతాల‌ను ఆదేశించింది. తల్లిదండ్రుల నిర్వహణ, సంక్షేమ చట్టం అమలుకు సంబంధించి రాష్ట్రాల నివేదిక స్థితిని కూడా బ‌హిర్గ‌తం చేయాల‌ని జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు యాక్సిడెంట్! గేదెలను ఢీకొనడంతో ముందటి భాగం డ్యామేజీ.. నాలుగు గేదెల మృత్యువాత

వృద్ధులకు పింఛన్లు, ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమాలు, వృద్ధాప్య సంరక్షణ స్థాయి వంటి వాటికి సంబంధించిన పథకాలను కోర్టు ముందు ఉంచాల‌ని నిర్దేశిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఈ మూడు అంశాల స‌మాచారాన్ని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు యూనియన్ ఆఫ్ ఇండియా అడ్వకేట్-ఆన్-రికార్డ్‌కు అందించాల‌ని ఆదేశించారు.

దుర్గా పూజకు చందా ఇవ్వ‌లేద‌ని మ‌హిళ‌ను దారుణంగా కొట్టి హ‌త్య‌.. ఎక్క‌డంటే ?

రెండు నెలల వ్యవధిలో అన్ని సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సమాచారాన్ని సేకరించిన తర్వాత, సవరించిన స్థితి నివేదికను ఒక నెల తరువాత భారత యూనియన్ దాఖలు చేస్తుంద‌ని ధ‌ర్మాస‌నం పేర్కొంది. 

దేశవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలతో వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారించింది. ఈ సంద‌ర్భంగానే సంబంధిత స‌మాచారాన్ని అందించాల‌ని ధ‌ర్మాస‌నం కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల‌ను కోరింది. కాగా.. ఈ కేసును 2023 జనవరిలో సుప్రీం కోర్టు విచారణకు తీసుకోనుంది. 

దుర్గా విగ్రహాల నిమజ్జనం.. విషాద ఘ‌ట‌న‌ల్లో 10 మంది మృతి.. ప‌లువురు గ‌ల్లంతు

అశ్వ‌నీ కుమార్ దాఖ‌లు చేసిన ప్రజా ప్రాయోజిత వ్యాజ్యంలో.. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్-2007ను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. దేశంలో పెద్ద సంఖ్యలో వృద్ధులు పెరుగుతున్నారని, వారిలో చాలా మంది పేదరికంలో ఉన్నారని తెలిపారు. కొంద‌రు అయితే ఇంటికి పైక‌ప్పు, వేసుకోవ‌డానికి స‌రైన దుస్తులు లేకుండానే జీవిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొంత మందికి ఆహారం కూడా అంద‌టం లేద‌ని పేర్కొన్నారు. 

click me!