ముగ్గు వేసినందుకు అరెస్ట్, చెన్నై పోలీసులపై విమర్శలు

Siva Kodati |  
Published : Dec 29, 2019, 09:14 PM IST
ముగ్గు వేసినందుకు అరెస్ట్, చెన్నై పోలీసులపై విమర్శలు

సారాంశం

నరేంద్రమోడీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

నరేంద్రమోడీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చెన్నైలో కొందరు ఆందోళనకారులు ముగ్గులు వేసి తమ నిరసనను తెలియజేశారు.

దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నందునే వీరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Also Read:ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, 65 ఏళ్లకు పెళ్లి

అయితే చెన్నై పోలీసులు నిరసన తెలియజేసేందుకు తమకు ఎలాంటి అనుమతి ఇవ్వకపోవడం వల్లే రోడ్లపైనా, ఇంటి ముందు ముగ్గులు వేసి సీఏఏ బిల్లుపై నిరసన తెలియజేసినట్లు ఒకరు తెలిపారు.

Also Read:సీఏఏ ఆందోళనలు... నష్ట పరిహారంగా రూ.6లక్షలు

కాగా నిరసనకారులను విడిపించేందుకు వచ్చిన ఇద్దరు న్యాయవాదులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకోవడం కొసమెరుపు. దీనిపై నటి రిచా చద్దా మాట్లాడుతూ.. ముగ్గులు వేయడం కూడా జాతి వ్యతిరేకమా అంటూ ఆమె ట్వీట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?