ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, 65 ఏళ్లకు పెళ్లి

By narsimha lode  |  First Published Dec 29, 2019, 5:02 PM IST

60 ఏళ్ల వయస్సులో  వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అంతేకాదు ఆ వయస్సులో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకొంది.



తిరువనంతపురం: ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. 60 ఏళ్ల వయస్సులో వారిద్దరూ ఒకరిపై మరోకరు మనసు పారేసుకొన్నారు. ఇది నిజంగా నిజమే. అచ్చు సినిమాల్లో చూపించినట్టుగా అన్పిస్తోంది. కానీ, ఇది నిజమే. సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకొంటాయని కేరళలో జరిగిన ఓ ఘటన రుజువు చేస్తోంది.

కేరళ రాష్ట్రంలోని తిస్సూరుకు చెందిన  67 ఏళ్ల కొచానియన్, 65 ఏళ్ల లక్ష్మీ అమ్మాళ్‌ భర్త వద్ద గతంలో అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. 21 ఏళ్ల క్రితం లక్ష్మీ అమ్మాళ్ భర్త చనిపోయాడు. దీంతో  కొచానియన్  అక్కడ పనిమానేసి కేటరింగ్ వ్యాపారం ప్రారంభించాడు.  కొన్నేళ్ల క్రితం కొచానియన్ భార్య కూడ మరణించింది. దీంతో కుటుంబసభ్యులకు ఆయన భారమయ్యాడు. 

Latest Videos

ఈ క్రమంలోనే వయనాడులోని వృద్ధాశ్రమంలో కొచానియన్ చేరాడు. కొచానియన్‌ను  అధికారులు రామవర్మాపురంలోని  వృద్ధాశ్రమానికి  మార్చారు. అక్కడ లక్ష్మీ అమ్మాళ్ కలిసింది. లక్ష్మీ అమ్మాళ్ తో కొచానియన్‌కు గతంలోనే పరిచయం ఉంది. వీరిద్దరూ ఒకరినొకరు ఓదార్చుకొన్నారు. తమ మధ్య ఉన్న పరిచయాన్ని స్థానికంగా ఉన్న వారికి చెప్పారు.

ఈ పరిచయం వారిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. ఈ విషయాన్ని వారిద్దరూ స్నేహితులకు, వృద్దాశ్రమానికి చెందిన అధికారులకు చెప్పారు. అంతేకాదు తాము పెళ్లి చేసుకోవాలని కూడ నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయలని భావించారు. 

ఈ నెల 28వ తేదీన కొచానియన్, లక్ష్మీ అమ్మాళ్ పెళ్లి చేసుకొన్నారు. వృద్ధాశ్రమంలో ఈ పెళ్లితో పండగ వాతావరణం చోటు చేసుకొంది. ప్రస్తుతం ఈ వృద్ధ దంపతుల పోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


 

click me!