
మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జార్ఖండ్ లోని రాంచీలో ఇటీవల ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన హింసాకాండకు దారి తీసింది. ఈ ఘటనకు కారణమైన 29 మందిని జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. నిరసన సమయంలో ఆందోళనకారులు రాళ్లదాడికి పాల్పడ్డారు. పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించిన పోలీసు సిబ్బందితో పాటు అక్కడ ఉన్న సాధారణ పౌరులు కూడా గాయపడ్డారు. వాహనాలకు నిప్పంటించి ఆస్తులను ధ్వంసం చేశారు.
వివాహేతర సంబంధం : భర్తను, ప్రియురాలిని నగ్నంగా ఉరేగించిన భార్య..ఆ తరువాతే...
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆందోళన నేపథ్యంలో నగరంలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. సున్నితమైన జిల్లాలలో అదనపు బలగాలను మోహరించారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం ఈ హింసాకాండ చెలరేగింది. అయితే ఈ గుంపును సమీకరించేందుకు ‘వాస్సేపూర్ గ్యాంగ్’ అనే వాట్సాప్ గ్రూప్‌ను ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని వార్తా సంస్థ ఏఎన్ఐతో పోలీసులు తెలిపారు. ఈ గ్రూప్ అడ్మిన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.
ఈ హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ని ఏర్పాటు చేసింది. రాంచీలో జరిగిన సంఘటనపై దర్యాప్తు చేయడానికి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.. సెక్రటరీ అమితాబ్ కౌశల్, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజయ్ లట్కర్‌లతో కూడిన ఇద్దరు సభ్యుల ఉన్నత స్థాయి విచారణ కమిటీని గత శనివారం ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తన నివేదికను వారం రోజుల్లో సమర్పించనుంది.
MK Stalin On Congress Protest: "రాజకీయ ప్రత్యర్థులతో రాజకీయంగానే పోరాడాలి": సీఎం ఎంకే స్టాలిన్
హింసాకాండకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశామని, ఇప్పటి వరకు మొత్తం 42 ప్రాంతాల్లో దాడులు చేశామని సోమవారం పోలీసులు తెలియజేశారు. వారిని మహ్మద్ ఆరిఫ్ అలియాస్ రింకూ ఖాన్, బెలాల్ అన్సారీ, మహ్మద్ అష్ఫాక్, మహ్మద్ అనిష్, మహ్మద్ డానిష్ ఖాన్‌లుగా గుర్తించారు. ఆరుగురు నిందితులు వైద్య చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో షానవాజ్, మొహమ్మద్ ఉస్మాన్, మొహమ్మద్ తబారక్, అఫ్సర్ ఆలం, సర్ఫరాజ్ ఆలం, సవీర్ అన్సారీ ఉన్నారు. ఈ ఘటనకు ప్రమేయం ఉన్న వారిని వెతికేందుకు పోలీసులు గతంలో పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే కొంత సవరణ కోసం పోస్టర్‌ను తొలగించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
NCPCR: నిషేధించిన PUBG గేమ్ ను ఎలా ఆడుతున్నారు? కేంద్రాన్ని ప్రశ్నించిన NCPCR
జ్ఞాన్ వ్యాపి మసీదు, శివలింగం అంశంపై ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్ లో బీజేపీ మాజీ అధికార ప్రతినిధఙ నూపుర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింల అరాధ్యుడైన మహ్మద్ ప్రవక్తపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రయాగ్ రాజ్ తో పాటు మరి కొన్ని పట్ణణాల్లో ఆందోళనలు జరిగాయి. పశ్చిమ బెంగాల్ లోని హౌరా చేపట్టిన నిరసనలు కూడా హింసాత్మకంగా మారాయి. కాగా దేశంలో నూపుర్ శర్మను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నట్టుగానే.. ఆమెకు మద్దతుగా కూడా ర్యాలీలు తీస్తున్నారు.