MK Stalin On Congress Protest: "రాజకీయ ప్రత్యర్థులతో రాజకీయంగానే పోరాడాలి": సీఎం ఎంకే స్టాలిన్

Published : Jun 15, 2022, 06:18 AM ISTUpdated : Jun 15, 2022, 06:22 AM IST
MK Stalin On Congress Protest: "రాజకీయ ప్రత్యర్థులతో రాజకీయంగానే పోరాడాలి": సీఎం ఎంకే స్టాలిన్

సారాంశం

MK Stalin On Congress Protest: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలపై  ఈడీ చర్యను తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ త‌ప్పుబ‌డ్డారు. బిజెపిని లక్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు.   

MK Stalin On Congress Protest: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) చర్యను తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ త‌ప్పుబ‌డ్డారు. కేంద్ర‌ప్ర‌భుత్వానికి టార్గెట్ చేస్తూ.. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది కేంద్రంలోని అధికార బీజేపీ ..కాంగ్రెస్ పై చేస్తున్న రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు. 

రాజకీయ ప్రత్యర్థులతో రాజకీయంగానే పోరాడాలని, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అధికార బీజేపీ ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఉపయోగించడం  రాజకీయ ప్రతీకార  చర్య అని అభివ‌ర్ణించారు. ఈ చ‌ర్య‌ను తాను ఖండిస్తున్నానని ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు.

సామాన్యుల సమస్యలకు సమాధానం దొరకడం లేదని, ప్రజల ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు బీజేపీ ఇలాంటి మళ్లింపు వ్యూహాలను అనుసరిస్తోందని విమ‌ర్శించారు. రాజకీయ ప్రత్యర్థులతో రాజకీయంగా పోరాడాలి తప్ప ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను బలవంతం చేయడం ద్వారా కాదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని మంగళవారం వరుసగా రెండో రోజు ఈడీ ప్రశ్నించింది. అదే సమయంలో.. నేషనల్ హెరాల్డ్ దర్యాప్తులో రేపు వరుసగా మూడో రోజు కూడా చేరాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరింది.
 
ఇదిలాఉంటే.. రాహుల్‌గాంధీపై ఈడీ విచార‌ణ‌కు నిర‌స‌న‌గా రెండో రోజు కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఢిల్లీలో నిర‌స‌న తెలిపారు.  ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలను కూడా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా, ఏఐసీసీ కార్యదర్శి ప్రణవ్ ఝా, ఎన్‌ఎస్‌యూఐ చీఫ్ నీరజ్ కుందన్‌, కేసీ వేణుగోపాల్‌, అధిర్ రంజ‌న్ చౌద‌రి, గౌర‌వ్ గొగోయ్‌, దీపీంద‌ర్ సింగ్ హుడా త‌దిత‌రుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే కాంగ్రెస్ కార్యాలయం చుట్టూ 144 సెక్షన్ విధించారు.  
 
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతల విమ‌ర్శ‌లు

కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తే ఢిల్లీ పోలీసులు, మోదీ ప్రభుత్వం సిగ్గులేకుండా పోయిందని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా అన్నారు. మహిళా ఎంపీ జేబీ మాథర్‌ను పురుష కానిస్టేబుళ్లు ఈడ్చుకెళ్లిన తీరు, కొట్టిన తీరు మోదీ ప్రభుత్వ మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

 ప్రతిపక్షాలకు కాంగ్రెస్ నేత‌ల‌ విజ్ఞప్తి 

ఈడీ, ఐటీ డిపార్ట్‌మెంట్ లేదా సీబీఐని  ఉపయోగించి తనపై వివిధ రాజకీయ పార్టీల నేతలను వేధిస్తున్నారని కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ సిఎం భూపేష్ బఘేల్ అన్నారు. ప్రతిపక్షాలు ఒకే వేదికపైకి రావాలని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని, స‌మైక్యంగా క‌లిసి పోరాటం చేయాల‌ని అన్నారు.

జూన్ 2న హాజరుకావాలని రాహుల్ గాంధీని దర్యాప్తు సంస్థ గతంలోనే కోరింది. కానీ రాహుల్ గాంధీ విదేశాల్లో ఉండ‌టంతో.. తాను విచార‌ణ‌కు హాజరు కాలేన‌ని వేరే తేదీని అభ్యర్థించాడు. ఇదే విషయమై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని జూన్ 8న హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. కానీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమెకు కరోనా సోకింది. ఇంకా కోలుకోనందున హాజరు కావడానికి మరింత సమయం కోరింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం