తాజ్ మహల్ ఆస్తి పన్ను, నీటి బిల్లులు.. ఆగ్రా కోటకు మరోటి.. రూ. కోటికి పైగా బకాయిలు చెల్లించాలని నోటీసులు...

By SumaBala BukkaFirst Published Dec 20, 2022, 12:01 PM IST
Highlights

ఆస్తిపన్ను, వాటర్ బిల్లులు కట్టాలంటూ తాజ్ మహల్‌కు రెండు, ఆగ్రా కోటకు ఒకటి.. ఇప్పటివరకు మూడు నోటీసులు అందాయి. ఈ మేరకు ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ధృవీకరించింది. 

లక్నో: వందలయేళ్ల చరిత్ర కలిగి.. ప్రేమకు చిహ్నంగా భావించబడుతున్న తాజ్ మహల్ ను చూడడానికి దేశవిదేశాలనుంచి పర్యాటకులు క్యూలు కడుతుంటారు. ముఖ్యంగా విదేశీయులు మన దేశానికి రావడానికి ప్రధాన ఆకర్షణల్లో తాజ్ మహల్ ఒకటి. అయితే.. తాజ్ మహల్ కు ఇంటిపన్ను, నీటిపన్ను నోటీసులు రావడంతో ఇప్పుడు మరో కోణంలో ఈ ప్రాచీన కట్టడం వార్తల్లో నిలిచింది. 

ఆగ్రాలోని తాజ్ మహల్ ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులను భారతదేశానికి ఆకర్షిస్తుంది.  ఆగ్రాలోని తాజ్ మహల్ 370 ఏళ్ల చరిత్ర ఉంది. ఇన్నేళ్లలో మొదటిసారిగా ఆస్తి పన్ను, నీటి బిల్లుల నోటీసులు అందుకుంది. అయితే, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) అధికారులు దీనిని పొరపాటు జరిగింది అని చెబుతున్నారు. ఈ పొరపాటు త్వరలో పరిష్కారం అవుతుందని వారు ఆశిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని వివిధ విభాగాలు తాజ్ మహల్, ఆగ్రా కోట రెండింటికీ బిల్లులు బకాయిపడ్డాయని.. వాటిని వెంటనే చెల్లించాలని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు నోటీసులు అందజేశాయి. ఈ బకాయిలు రూ. కోటి కంటే ఎక్కువ ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటివరకు మూడు నోటీసులు అందాయి. అందులో తాజ్ మహల్‌కు రెండు, ఆగ్రా కోటకు ఒకటి. దీనిమీద ఆగ్రాలోని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ పటేల్ ఇది నిజమేనని ధృవీకరించారు.

ప్రాణాలను పణంగా పెట్టి.. నీటి ప్ర‌వాహంలో చిక్కుకున్న కుక్కను కాపాడాడు.. వీడియో వైరల్

"తాజ్ మహల్ విషయంలో, మాకు రెండు నోటీసులు వచ్చాయి, ఒకటి ఆస్తిపన్ను, మరొకటి నీటి సరఫరా విభాగం నుండి.. దీంట్లో 12 పాయింట్లు ఉన్నాయి. ఈ మేరకు ఈ నోటీసుల్లో మొత్తం 1 కోటి రూపాయలు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుండి డిమాండ్ చేశారు" అని డాక్టర్ పటేల్ చెప్పారు.

స్మారక కట్టడాలకు పన్నులు వర్తించవు కాబట్టి ఇది పొరపాటుగా జరిగి ఉంటుందని ఆ అధికారి తెలిపారు. "మొదట, స్మారక ప్రాంగణానికి ఆస్తి పన్ను లేదా ఇంటి పన్ను వర్తించదు. ఉత్తరప్రదేశ్ చట్టాలలో కూడా ఈ నిబంధన ఉంది. ఇతర రాష్ట్రాలకు కూడా ఉంది. ఇక వాటర్ బిల్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు అలాంటి డిమాండ్ ఎప్పుడూ లేదు. ఏదైనా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే ప్రశ్న.. కానీ నీటి కనెక్షన్ నను తాజ్ కాంప్లెక్స్ లోపల నిర్వహించే లాన్లు.. ప్రజా సేవ కోసం వాడుతున్నాం. కాబట్టి బకాయిల గురించి ఎటువంటి ప్రశ్న లేదు, "డాక్టర్ పటేల్ చెప్పారు.

మొఘల్ చక్రవర్తి అక్బర్ నిర్మించిన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఆగ్రా కోట, 1638 వరకు రాజధాని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చబడే వరకు మొఘల్ రాజవంశ చక్రవర్తుల ప్రధాన నివాసంగా ఉంది. ఈ చారిత్రాత్మక స్మారక చిహ్నానికి ఐదు కోట్ల రూపాయల పన్ను డిమాండ్ కూడా వచ్చిందని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. "ప్రపంచ వారసత్వ స్మారక చిహ్నం అయిన ఆగ్రా కోట కోసం కంటోన్మెంట్ బోర్డు మొత్తం రూ. 5 కోట్లకు పైగా చెల్లించాలని మాకు నోటీసులు ఇచ్చింది. 

సంబంధిత ప్రభుత్వ చట్టం స్మారక చిహ్నాలను పన్నుల నుంచి మినహాయించిందని మేము వారికి సమాధానం ఇచ్చాం" అని డాక్టర్ పటేల్ చెప్పారు.నోటీసులు ఎలా జారీ చేశారనే దానిపై విచారణకు ఆదేశించామని ఆగ్రాలోని సీనియర్ మున్సిపల్ అధికారిని ఉటంకిస్తూ ఓ పత్రిక పేర్కొంది. ప్రభుత్వంతో ఒప్పందంపై ఒక ప్రైవేట్ కంపెనీ నోటీసులను ప్రాసెస్ చేస్తోందని అధికారి తెలిపారు.

click me!