ఇటుకతో భర్తను కొట్టి చంపిన భార్య.. మార్కెట్ కు వెళ్లొద్దన్నాడని నడివీధిలో దారుణం..

Published : Dec 20, 2022, 11:16 AM IST
ఇటుకతో భర్తను కొట్టి చంపిన భార్య.. మార్కెట్ కు వెళ్లొద్దన్నాడని నడివీధిలో దారుణం..

సారాంశం

ఓ చిన్న గొడవ కారణంగా భర్తను అతి దారుణంగా హతమార్చింది ఓ భార్య. మార్కెట్ కు వెడతానంటే వద్దన్నాడని ఇటుకతో దాడిచేసి అంతమొందించింది. 

ఝార్ఖండ్ : చిన్న చిన్న విషయాలకే హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి.  అలాంటి దారుణమైన ఘటన ఝార్ఖండ్ లో జరిగింది. ఓ మహిళ మార్కెట్ కు వెడతానని భర్తకు చెప్పింది. దానికి అతను వద్దని చెప్పాడు. దీంతో ఇటుకతో భర్తను కొట్టి హత్య చేసింది ఆ భార్య. షాకింగ్ గా ఉన్న ఈ ఘటన ఝార్ఖండ్ లోని ఖంటీ జిల్లాలో జరిగింది. 

తోర్పా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే అర్జున్ సింగ్, కళావతి భార్యాభర్తలు. ఓ రోజు అర్జున్ సింగ్ వీధిలో నల్లదగ్గర స్నానం చేస్తున్నాడు. ఆ సమయంలో భార్య అతని దగ్గిరికి వచ్చింది. మార్కెట్ కు వెడతానని అతనిని అడిగింది. దీనికి అర్జున్ సింగ్ వద్దని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. గొడవ జరిగింది. ఈ గొడవ కారణంగా తీవ్ర కోపానికి లోనైన కళావతి విచక్షణ కోల్పోయింది. అక్కడే ఉన్న ఇటుక తీసుకుని భర్త తల మీద కొట్టింది. 

ఇదేం ప్రేమరా బాబోయ్.. పెళ్లై, పిల్లలు ఉండి.. మరో వివాహితను భర్తముందే ప్రేమించమని వేధించి.. చివరికి..

అనుకోని ఈ పరిణామానికి తీవ్రంగా గాయపడిన అర్జున్ సింగ్ కిందపడ్డాడు. అయినా కూడా కళావతి కోపం తగ్గలేదు. భర్త తలమీద ఇటుకతో మోదుతూనే ఉంది. ఈ ఘర్షణకు చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకున్నారు. వారు ఆమెను ఆపడానికి ప్రయత్నించారు. కానీ కళావతి వారిని కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది. ఇటుకతో కొట్టడానికి ప్రయత్నించింది. 

దీంతో వారు వెనక్కి తగ్గారు. తరువాత రక్తపుమడుగులో ఉణన భర్తను భుజాన వేసుకుని ఇంటికి చేరుకుంది. అన్ని గదులకు తాళాలు వేసింది. ఈ విషయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అర్జున్ సింగ్ ప్రాణాలు వదిలాడు. తది తాళాలు తీయించి.. కళావతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మీద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో కళావతి తన నేరాన్ని అంగీకరించింది. 

PREV
click me!

Recommended Stories

చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families