మెట్రో స్టేషన్ ల గోడలపై ఖలిస్థాన్ అనుకూల నినాదాలు.. జీ-20 సదస్సుకు ముందు నగరంలో కలకలం

Published : Aug 27, 2023, 02:35 PM IST
మెట్రో స్టేషన్ ల గోడలపై ఖలిస్థాన్ అనుకూల నినాదాలు.. జీ-20 సదస్సుకు ముందు నగరంలో కలకలం

సారాంశం

ఢిల్లీలోని ఐదు మెట్రో స్టేషన్ల గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు ఖలిస్థాన్ అనుకూల నినాదాలతో గ్రాఫిటీ చేశారు. ఆ గోడలపై ‘ఢిల్లీ బనేగా ఖలిస్థాన్, ఖలిస్తాన్ జిందాబాద్’ అని దుండుగులు పేర్కొన్నారు. దేశ రాజధాని జీ 20 శిఖరాగ్ర సదస్సుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఇది చోటు చేసుకుంది.

జీ -20 సదస్సుకు ముందు దేశ రాజధాని ఢిల్లీలో ఖలిస్థాన్ నినాదాలు కలకలం రేకెత్తించాయి. ఢిల్లీలోని ఐదుకు పైగా మెట్రో స్టేషన్ల గోడలపై ఆదివారం ఖలిస్థాన్ అనుకూల నినాదాలు రాసి కనిపించాయి. వాటిపై ‘ఢిల్లీ బనేగా ఖలిస్థాన్, ఖలిస్తాన్ జిందాబాద్’ అపి పేర్కొని ఉంది. దీనిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.

పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ బాగ్, శివాజీ పార్క్, మదిపూర్, పశ్చిమ్ విహార్, ఉద్యోగ్ నగర్, మహారాజా సూరజ్మల్ స్టేడియం సహా మెట్రో స్టేషన్ల గోడలపై 'ఢిల్లీ బనేగా ఖలిస్తాన్', 'ఖలిస్తాన్ రెఫరెండం జిందాబాద్' వంటి నినాదాలు నల్లరంగులో స్ప్రే చేయబడ్డాయి. నిషేధిత సిక్కుస్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) కార్యకర్తలు శివాజీ పార్క్, పంజాబీ బాగ్ సహా పలు మెట్రో స్టేషన్లలో ఉండి ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాశారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

దేశ రాజధాని జీ 20 శిఖరాగ్ర సదస్సుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఇది చోటు చేసుకుంది.  సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు ఢిల్లీలో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు యూరోపియన్ యూనియన్ కు చెందిన 30 మంది దేశాధినేతలు, ఉన్నతాధికారులు, ఆహ్వానిత దేశాలు, 14 మంది అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరుకానున్నారు. జీ20 సదస్సుకు ముందు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాసిన ఢిల్లీ మెట్రో స్టేషన్ల ఫుటేజీని సిక్కుస్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) విడుదల చేసింది.

అలాగే నంగ్లోయిలోని ప్రభుత్వ సర్వోదయ బాల విద్యాలయ గోడలు భారత వ్యతిరేక గ్రాఫిటీతో నిండిపోయింది. దీనిపై ఢిల్లీ పోలీసు స్పెషల్ ఫోకస్ చేసింది. వివిధ ప్రదేశాలలో బలగాలను మోహరించింది. కాగా.. మెట్రో స్టేషన్ల గోడలపై రాసిన గ్రాఫిటీలన్నింటినీ తొలగించినట్లు డీసీపీ (మెట్రో) తెలిపారు. అనుమానితులను గుర్తించి వీలైనంత త్వరగా అరెస్టు చేసేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే