కేరళ గవర్నర్‌తో తరుణ్ విజయ్ భేటీ:ఆరిఫ్ ఖాన్ పై ప్రశంసలు

Published : Jan 03, 2022, 08:26 PM ISTUpdated : Jan 03, 2022, 08:31 PM IST
కేరళ గవర్నర్‌తో తరుణ్ విజయ్ భేటీ:ఆరిఫ్ ఖాన్ పై ప్రశంసలు

సారాంశం

కోచి నేషనల్ మూనుమెంట్స్ అధారిటీ చైర్మెన్ తరుణ్ విజయ్  సోమవారం నాడు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ను కలిశారు.ఆదిశంకరాచార్య జన్మస్థలాన్ని పవిత్ర స్థలంగా, జాతీయ ప్రాముఖ్యత గల స్మారక చిహ్నంగా ప్రకటించడానికి సంబంధించిన విషయమై తరుణ్ విజయ్ గవర్నర్ తో చర్చించారు. 

తిరువనంతపురం: Kochi నేషనల్ మానుమెంట్స్ అథారిటీ చైర్మెన్ Tarun Vijay  సోమవారం నాడు Kerala Governor    Arif Mohammad Khan ను కలిశారు.  ఆదిశంకరాచార్య జన్మస్థలాన్ని పవిత్ర స్థలంగా, జాతీయ ప్రాముఖ్యత గల స్మారక చిహ్నంగా ప్రకటించడానికి సంబంధించిన విషయమై తరుణ్ విజయ్ గవర్నర్ తో చర్చించారు. అయితే ఈ విషయమై గవర్నర్  తరుణ్ విజయ్ కు  హామీ ఇచ్చారు. NMA  చేస్తున్న ప్రయత్నాలను గవర్నర్ Arif Khan అభినందించారు.

 

రెండు రోజుల క్రితమే తాను ఈ ప్రాంతాన్ని సందర్శించినట్టుగా తరుణ్ విజయ్ గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. Adi Sankara ల జన్మస్థలం ప్రాముఖ్యతకు సంబంధించిన నివేదికను సిద్దం చేస్తామని చెప్పారు.ఆదిశంకరాచార్యుడు 8వ శతాబ్దానికి చెందిందిగా తరుణ్ విజయ్ చెప్పారు.  

also read:మర్యాద లేదా: పినరయి విజయన్ పై మండిపడ్డ గవర్నర్ ఆరిఫ్

ఇటీవలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేదార్ నాథ్ ఆలయ ప్రాంతంలో ఆదిశంకరుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు.వినయం, వ్యక్తిగత స్నేహానికి, మానవతావాదానికి ప్రతీకగా గవర్నర్ ఆరిఫ్ ఖాన్ నిలిచారు. మూడు చక్రాల వీల్ చైర్ లో వచ్చిన తరుణ్ విజయ్ ను ఆయన కారు వరకు వీల్ చైర్ ను నడుపుకొంటూ తరుణ్ విజయ్ ను తీసుకెళ్లాడు.


 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?