
అయోధ్యలో ప్రసిద్ధి చెందిన దీపోత్సవ్ లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని దీపావళి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. అయోధ్యలోని లేజర్ లైట్, మ్యూజికల్ షోలను ప్రధాని వీక్షించనున్నారు. అనంతరం రామ్ లల్లా విరాజ్మాన్ ను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ వేడుకల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన వెంట ఉండనున్నారు.
రైలు నుంచి జారిపడి.. కదులుతున్న రైలుకు ప్లాట్ ఫామ్ కు మధ్యలో ఇరుక్కున్న మహిళ..
మూడు రోజుల పాటు జరిగే ఈ దీపోత్సవ్ అక్టోబర్ 21న ప్రారంభమైంది. అయోధ్యలోని రామ్ కీ పైడి, ఇతర ప్రదేశాలలో కనీసం 17 లక్షల దీపాలను వెలిగించి గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. శ్రీరాముడు, నిషాద్రాజ్, అహల్య కుటుంబ సభ్యుల పేరు మీదుగా ఈ కార్యక్రమానికి నామకరణం చేయనున్నారు.
ఇది కాకుండా, దీపోత్సవ్ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి వివిధ నృత్య రూపాలతో ఐదు యానిమేటెడ్ టాబ్లౌలు, పదకొండు రామ్ లీలా టాబ్లౌలను ప్రధాని వీక్షించనున్నారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గట్టి పోటీని ఎదుర్కోనున్న తరుణంలో ప్రధాని మోడీ అయోధ్యను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అసలేంట్రా బాబు నీ ధైర్యం.. ఏకంగా కింగ్ కోబ్రాకు కిస్.. ఇంటర్నెట్‌లో వీడియో వైరల్..
అయోధ్యలో దీపావళి సన్నాహకాలు
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దీపోత్సవంతో పాటు, రాముడు జీవించిన త్రేతాయుగం లాంటి భావనలు కలిగించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ‘‘రామాయణ ద్వారాలను’’ కూడా నిర్మిస్తోంది. ఈ ద్వారాలు త్రేతాయుగం వాస్తుశిల్పాన్ని పోలి ఉంటాయి. సందర్శకులను చరిత్రలోకి తీసుకెళ్తాయి.
విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్.. భావోద్వేగానికి లోనైనా అనుష్క శర్మ
ఇలాంటి 15 రామాయణ ద్వారాలను ప్రభుత్వం నిర్మిస్తోందని, ఇది ప్రకాశవంతమైన అయోధ్యకు దారితీస్తుందని అధికారులు తెలిపారు. రామ్ కీ పైడిపై రాముడు, సీత, లక్ష్మణుడు, భరత్, శత్రుఘ్న, హనుమంతుడి విగ్రహాలకు సమీపంలో సెల్ఫీ పాయింట్ ను కూడా ఏర్పాటు చేశారు. పుష్పక్ విమాన ద్వారా శ్రీరాముడు లంక నుంచి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని తెలియజేసే గ్రాఫిక్స్ కూడా తయారు చేస్తున్నారు.