అసలేంట్రా బాబు నీ ధైర్యం.. ఏకంగా కింగ్ కోబ్రాకు కిస్.. ఇంటర్నెట్‌లో వీడియో వైరల్..

By Rajesh Karampoori  |  First Published Oct 24, 2022, 4:46 AM IST

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన,ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను  ఓ వ్యక్తి  ముద్దుపెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. 


సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు క‌నిపిస్తాయి. కాస్త ఆసక్తికరంగా ఉంటే చాలు.. క్షణాల్లో ఆన్‌లైన్‌లో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంటాయి. ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాలో ఓ వీడియో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. కానీ.. ఆ వీడియో చూడాలంటే.. మాత్రం కాస్త ధైర్యం  ఉండాలి. వీడియో చూడటానికి ధైర్యమేందుకు అనుకుంటున్నారా? అసలు ఆ వీడియో చూస్తే..  భయపడుతారు. ఆ వీడియోలో అంతగా ఏముందని ఆలోచిస్తున్నారా? అందులో ఒక వ్యక్తి ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను ముద్దుపెట్టుకోవడం కనిపించింది.

ఒళ్లు గగుర్పాటు గురయ్యే ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెగ వైరల్ అవుతోంది.. ఇది చూసే వారు ఎవరైనా భయపడాల్సిందే.. ఈ వీడియోలో.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన, ప్రమాదకరమైన పామును ముద్దుపెట్టుకోవడం కనిపిస్తుంది. ఆ పాముని ముద్దాడేందుకు ఆ వ్యక్తి మెల్లగా దాని దగ్గరకు వెళ్లి కొద్దిసేపటి తర్వాత దానిని ముద్దుపెట్టుకోవడం వీడియోలో చూడవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..ఆ పాము ఎలాంటి స్పందన లేకుండా ఉండిపోవడం ఆ వీడియో చూడవచ్చు.  

Latest Videos

ఈ భయాందోళనకు గురి చేసే వీడియోను సౌరభ్ జాదవ్ జాదవ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పామును ముద్దాడిన వ్యక్తి పేరు వావా సురేష్ అని, అతడో పాపులర్ స్నేక్ క్యాచర్ అని పేర్కొన్నారు. కేరళకు చెందిన స్నేక్ క్యాచర్ సురేష్ ఇప్పటివరకు 38 వేల పాములను పట్టుకున్నారు. కొంతమంది ఈ వ్యక్తిని 'స్నేక్ మ్యాన్ ఆఫ్ కేరళ' అని కూడా పిలుస్తారు. ఈ వ్యక్తి ఇప్పటివరకు 190కి పైగా కింగ్ కోబ్రాలను రక్షించాడు. 

ఇటీవల కర్నాటకలోని శివమొగ్గలో ఓ వ్యక్తి నాగుపామును రక్షించి ముద్దాడేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ సమయంలో అతడి పెదవిపై పాము కాటు వేసింది. ఘటన తర్వాత యువకుడి పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యాడు. సకాలంలో చికిత్స అందించడంతో యువకుడి ప్రాణం కాపాడినట్లు వైద్యులు తెలిపారు.

click me!