
కొత్త పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ అకడమిక్ డిగ్రీని ప్రదర్శించాలని శివసేన (యూబీటీ) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. ప్రధాని తన డిగ్రీని రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారని ప్రశ్నించారు. ఇలా చేస్తూ ప్రజల మనస్సుల్లో ఇంకా అనేక సందేహాలను సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. సోమవారం ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
గాడిద పాల సబ్బులు మహిళలను అందంగా ఉంచుతాయి.. క్లియోపాత్రా వాడేది: మేనకా గాంధీ వ్యాఖ్యలు వైరల్
‘‘కొందరు ప్రధాని డిగ్రీని ఫేక్ అంటున్నారు. పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ చారిత్రాత్మకమైనది, విప్లవాత్మకమైనదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి ప్రజలు దానిపై సందేహాలు వ్యక్తం చేయకుండా ఉండాలంటే కొత్త పార్లమెంటు గ్రాండ్ ఎంట్రన్స్ వద్ద దీన్ని ప్రదర్శించాలి’’ అని సంజయ్ రౌత్ అన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని డిగ్రీ వివరాలు అడిగారని, కానీ దానిని తిరస్కరించి రూ .25,000 జరిమానా కూడా విధించారని సంజయ్ రౌత్ తెలిపారు. ‘‘ప్రధానిని డిగ్రీ అడుగుతుంటే దాచడానికి ఏముంది ? మోడీ స్వయంగా ముందుకు వచ్చి తన విద్యార్హతపై నెలకొన్న సందేహాలను క్లియర్ చేయాలని మేము భావిస్తున్నాము’’ అని రౌత్ కోరారు.
ఇదిలావుండగా.. బీహార్, పశ్చిమ బెంగాల్ లో ఇటీవల జరిగిన మతఘర్షణలకు అధికార బీజేపీయే కారణమని సంజయ్ రౌత్ ఆరోపించారు. పశ్చిమబెంగాల్ లో జరుగుతున్న హింసాకాండను ఆ పార్టీయే ప్లాన్ చేసి, స్పాన్సర్ చేసి, టార్గెట్ చేసిందని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న చోట, బీజేపీ ఓటమి భయంతో ఉన్న చోట, బలహీనంగా ఉన్న చోట అల్లర్లు జరుగుతున్నాయని అన్నారు.
కాగా.. శివసేన (యుబీటీ) అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా ఏక్ నాథ్ షిండే కు డాక్టరేట్ రావడంపై విమర్శలు గుప్పించారు. ఆదివారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. ‘‘కొందరు డిగ్రీలు పొందుతారు. మరికొందరు సంపాదిస్తారు.. ఇప్పుడు పీహెచ్ డీలు కూడా అమ్మకానికి వచ్చినట్లు తెలుస్తోంది. దానిని ఒకరు దాస్తుంటే, మరొకరు ప్రదర్శిస్తున్నారు. అయితే డిగ్రీ ప్రదానం చేసిన కళాశాల వారి పూర్వ విద్యార్థులను చూసి గర్వపడాలి. కానీ దానికి బదులు (ప్రధాని డిగ్రీని) ప్రశ్నించేవారికి, దానిని చూడిగే వారికి జరిమానా విధిస్తారు" అని ఠాక్రే అన్నారు. ఇలా ఎంతో మంది బీజేపీ నాయకులు అనుమానస్పద డిగ్రీలు సంపాదించారని, ఇది దేశానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశమని అన్నారు.
కర్ణాటకలో దారుణం.. నవజాతశిశువును నోట కరుచుకుని ఆస్పత్రి చుట్టూ వీధికుక్క చక్కర్లు... !
గత శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ వివరాలు అందించాలని గుజరాత్ విశ్వవిద్యాలయాన్ని ఆదేశిస్తూ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) 2016లో ఇచ్చిన ఉత్తర్వులను గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో కోర్టు రూ.25 వేల జరిమానా విధించింది. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ప్రధాని తన డిగ్రీని చూపించకపోవడానికి రెండు కారణాలు ఉండొచ్చని ఆరోపించారు. ఒకటి ప్రధాని తన అహం వల్ల అది ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదని, ఇంకోంటి ఏంటంటే అది ఫేక్ డిగ్రీ కావచ్చని ఆరోపించారు.