కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ మేనకా గాంధీ యూపీలో ఓ చోట మాట్లాడుతూ గాడిద పాల గురించి మాట్లాడారు. గాడిద పాలతో తయారు చేసిన సబ్బులు మహిళలను అందంగా ఉంచుతాయని వివరించారు. ఈజిప్టు రాణి క్లియోపాత్ర గాడిద పాలలోనే స్నానం చేసేదని అన్నారు.
లక్నో: బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో చౌపాల్‌లో మాట్లాడారు. ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, గాడిద పాలతో చేసిన సబ్బులు మహిళలను అందంగా ఉంచుతాయని అన్నారు. ఈజిప్టు రాణి క్లియోపాత్రా గాడిద పాలతో స్నానం చేసేదని చెప్పారు.
‘చాలా ఫేమస్ రాణి క్లియోపాత్రా గాడిద పాలలో స్నానం చేసేది. గాడిద పాలతో చేసిన సబ్బు ఒకదానికి ఢిల్లీలో రూ. 500 వరకు ఉంటుంది. అదే గాడిద పాలతో, మేక పాలతో మనం ఎందుకు సబ్బులు తయారు చేయవద్దు?’ అని ఆమె అడిగారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
गधे के दूध का साबुन औरत के शरीर को खूबसूरत रखता है"इनकी सुंदरता की राज आजा के सामने आई जो गधे के दूध से बनी और गोबर से बनी साबुन का प्रोडक्ट यूज करती हैं
◆ BJP सांसद का बयान | BJP | | Maneka Gandhi pic.twitter.com/rXW1aY1t6o
అదే ప్రసంగంలో ఆమె లడాఖ్‌కు చెందిన ఓ వర్గాన్ని ప్రస్తావించారు. ‘మీరు గాడిదను చూసి ఎన్ని రోజులవుతున్నది? గాడిదలు కనిపించకుండా పోతున్నాయి. చాకలివారూ గాడిదలను ఇప్పుడు ఉపయోగించడం లేదు. కానీ, లడాఖ్‌లో ఓ కమ్యూనిటీ ఉన్నది. గాడిదల సంఖ్య తగ్గిపోతున్నదని వారు గమనించారు. అప్పుడు వారు గాడిద పాలు పితికారు. వాటితో సబ్బులు తయారు చేశారు. గాడిద పాలతో చేసిన సబ్బులు మహిళలను సుందరంగా ఉంచుతాయి’ అని ఆమె అన్నారు.
ధరలు పెరిగిపోతున్నాయని, చెట్లు తగ్గిపోతున్నందున కలప ధర కూడా ఆకాశాన్ని అంటుతున్నదని ఆమె తెలిపారు. ఈ కారణంగా మనిషి చనిపోతే.. దహనం కూడా ఖరీదైన వ్యవహారంగా మారిందని చెప్పారు. చావు పేదలను మరింత పేదలుగా మార్చేస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పుడు కలప రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఖరీదు చేస్తున్నదని చెప్పారు. అయితే, కలపకు బదులు గోవు పేడతో చేసి మెటీరియల్‌నూ ఇందుకు వాడుకోవచ్చని వివరించారు. గోవు పేడతో చేసిన మెటీరియల్‌తో దహనం చేస్తే ఖర్చు రూ. 1,500 నుంచి రూ. 2000 వరకు అవుతుందని అన్నారు.
పశువులతో డబ్బులు సంపాదించడం సాధ్యం కాదని అన్నారు. అందుకే మేకలను, ఆవులను పెంచాలనే సలహా తాను ఇవ్వనని చెప్పారు. ఆవో, గేదెనో, మేకనో అనారోగ్యం బారిన పడితే వాటిపై పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తామని, మహిళలు ప్రత్యేకంగా వాటి చూసుకోవడానికే సమయం కేటాయిస్తారని వివరించారు. కానీ, ఏదో ఒక రోజు అవి మరణిస్తాయని, అదంతా ముగిసిన కథగా మిగులు తుందని అన్నారు.