నాసిక్ కాలారం ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపర్చిన మోడీ

By narsimha lode  |  First Published Jan 12, 2024, 4:24 PM IST

మహారాష్ట్ర నాసిక్ లో  కాలారం శ్రీరాముడి ఆలయంలో  నరేంద్ మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయంలో  స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.



న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని నాసిక్ లో గల కాలారం శ్రీరాముడి ఆలయంలో  శుక్రవారం నాడు ప్రధాన మంత్రి  స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణాన్ని మోడీ శుభ్రపర్చారు. నాసిక్ లోని గోదావరి తీరాన ఈ ఆలయం ఉంది.  సీతా రాముడు, లక్ష్మణుడు   ఈ ప్రాంతంలో   కొంత కాలం ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది.  ఇలాంటి ఆలయంలో  స్వచ్ఛత కార్యక్రమంలో  పాల్గొన్నారు మోడీ. దేశ వ్యాప్తంగా  దేవాలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలను చేపట్టాలని మోడీ కోరారు. 

also read:రాముడు నడయాడిన నేలలో మోడీ పూజలు: నాసిక్‌లో రోడ్ షో

Latest Videos

అనంతరం నాసిక్ లో నిర్వహించిన  సభలో  మోడీ ప్రసంగించారు.  భారతదేశం కొత్త ఆవిష్కరణలు చేస్తుందన్నారు.  భారతదేశం రికార్డు పేటేంట్లను దాఖలు చేస్తుందని చెప్పారు. వీటన్నింటి వెనుక దేశ యువత ఉందని ఆయన తెలిపారు.  దేశ యువతకు  అమృత్ కాల్ ఒక స్వర్ణ యుగం లాంటిందన్నారు.  

ప్రపంచంలోని ఐదు ఆర్ధిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటన్నారు.  ప్రపంచంలోని టాప్  మూడు స్టార్టప్ సిస్టమ్ లలో భారత్ కూడ ఉందని ఆయన  చెప్పారు. కొత్త ఆవిష్కరణలు వద్దన్నారు.  భారతదేశం రికార్డు స్థాయిలో పేటెంట్లు నమోదు చేస్తుందని చెప్పారు. వీటన్నింటి వెనుక దేశంలోని యువత ఉందన్నారు. దేశ యువతకు అమృత్ కాల్ స్వర్ణయుగంగా ఆయన  పేర్కొన్నారు. 

also read:సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....

భారత దేశంలోని వివిధ గొప్ప వ్యక్తులు మహారాష్ట్రతో సంబంధం ఉన్నవారేనన్నారు.  రాముడు నాసిక్ లోని పంచవటిలో చాలా కాలం గడిపినట్టుగా మోడీ చెప్పారు.ఇవాళ భారతదేశపు యువశక్తి దినంగా ఆయన గుర్తు చేశారు. బానిసత్వపు రోజుల్లో దేశానికి కొత్త శక్తిని నింపిన మహానీయుడికి ఈ రోజు అంకితమన్నారు. స్వామి వివేకానంద జయంతి రోజున ఇక్కడికి రావడం తనకు ఆనందంగా ఉందన్నారు.   అంతేకాదు నారీ శక్తికి ప్రతీక అయిన రాజమాత జిజా బాయి జయంతి అని కూడ మోడీ గుర్తు చేశారు.

ఈ నెల  22న అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరగనుంది.అయితే ఇవాళ రాముడు నడిచిన నేలలో నిర్మించిన ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ కొద్దిసేపు గడిపారు.ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపర్చారు.  ఇవాళ్టి నుండి  11 రోజుల పాటు  క్రతువును ప్రారంభిస్తున్నట్టుగా  సోషల్ మీడియా వేదికగా మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.  మహారాష్ట్రలో ఇవాళ  పలు అభివృద్ది కార్యక్రమాలను మోడీ పాల్గొన్నారు.  సముద్రంపై నిర్మించిన అతి పొడవైన అటల్ సేతు బ్రిడ్జిని  మోడీ ప్రారంభించారు. 

 

click me!