ayodhya ram mandir : అయోధ్య పాస్‌లంటూ సైబర్ కేటుగాళ్ల వల .. ఆ లింక్ క్లిక్ చేశారో ఇక అంతే

By Siva Kodati  |  First Published Jan 12, 2024, 3:52 PM IST

అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం పూర్తి కాగా ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామాలయాన్ని ప్రారంభించనున్నారు. దేశ ప్రజలంతా రామయ్యను దర్శించుకోవాలని ఊవ్విళ్లూరుతున్నారు. ఇప్పుడు ఈ క్రేజ్‌ను కూడా క్యాష్ చేసుకోవాలని సైబర్ కేటుగాళ్లు చూస్తున్నారు. అయోధ్యకు స్పెషల్ ఆఫర్లు, వోచర్లు, పాస్‌ల పేరిట అందినకాడికి దోచుకుంటున్నారు. 

అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి కొద్దిమందికి మాత్రమే ఆహ్వానం అందడంతో లక్షలాది మంది భక్తులు నిరుత్సాహంలో వున్నారు. ఈ సంబరాలను నేరుగా తిలకించాలన్న కోరికతో వున్న భక్తుల వీక్‌నెస్ మీద సైబర్ నేరగాళ్లు కొడుతున్నారు. ఇందుకోసం నకిలీ టికెట్ల పేరుతో దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వీఐపీ టికెట్లు అందుబాటులో వున్నాయని, వీటిని మీకోసం అందిస్తున్నామని సైబర్ నేరగాళ్లు భక్తులకు మెసేజ్ పంపుతున్నారు. వీటిని క్లిక్ చేసిన వెంటనే వారి ఖాతాల్లోని డబ్బులు కొట్టేస్తున్నారు. 

Latest Videos

ఈ విషయం ఆ నోటా ఈ నోటా పోలీసుల వరకు చేరడంతో సైబర్ దాడులపై నిఘా పెట్టారు. ఇలాంటి మోసగాళ్ల విషయంలో జాగ్రత్తగా వుండాలని, ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. దీని ద్వారా మాల్వేర్‌ను మన మొబైల్స్‌, పీసీ, లాప్‌టాప్‌లలోకి చొప్పించి లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్స్, కాంట్రాక్ట్ నెంబర్లు, క్రెడిట్ కార్డు వివరాలు, బ్రౌజింగ్ హిస్టరీ వంటి సమాచారాన్ని సేకరించే ప్రమాదం వుందని నిపుణులు చెబుతున్నారు. అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ను సాధ్యమైనంత వరకు క్లిక్ చేయకుండా వుంచాలని హెచ్చరిస్తున్నారు. 

click me!