మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ 'ఆది మహోత్సవ్'ను ప్రారంభించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

Published : Feb 16, 2023, 11:58 AM IST
మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ 'ఆది మహోత్సవ్'ను ప్రారంభించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

సారాంశం

New Delhi: మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ "ఆది మహోత్సవ్" ను ప్రారంభమైంది.  దేశ రాజ‌ధాని ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ ఆది మహోత్సవ్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు.  

PM Modi Inaugurates Mega National Tribal Festival:  దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ 'ఆది మహోత్సవ్'ను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా కూడా పాల్గొన్నారు. జాతీయ వేదికపై గిరిజన సంస్కృతిని చాటిచెప్పే ప్రయత్నంగా దీనిని అభివ‌ర్ణించారు. ఈ ఆది మహోత్సవ్ గిరిజన సంస్కృతి, హస్తకళలు, వంటకాలు, వాణిజ్యం- సాంప్రదాయ కళల స్ఫూర్తిని జరుపుకుంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 27 వరకు ఆది మ‌హోత్స‌వ్ జరగనుంది.

 

ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో దేశంలోని గిరిజన జనాభా సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడంలో ప్రధాని మోడీ ముందువ‌రుస‌లో ఉన్నార‌ని పేర్కొంది. అలాగే, దేశ అభివృద్ధి, దీనికి కృషి చేసిన వారికి తగిన గౌరవం ఇస్తారని పేర్కొంది. ఆది మహోత్సవ్ అనేది గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ లిమిటెడ్ (TRIFED) వార్షిక కార్యక్రమం.
వివిధ సాంస్కృతి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. 

 

ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల గొప్ప, వైవిధ్యమైన వారసత్వాన్ని ఒకే వేదికపై 200 స్టాళ్లలో ప్రదర్శిస్తారు. సుమారు 1000 మంది గిరిజన కళాకారులు ఈ మహోత్సవంలో పాల్గొంటారు. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటున్నందున హస్తకళలు, చేనేత, కుండలు, ఆభరణాలు వంటి సాధారణ ఆకర్షణలతో పాటు, గిరిజనులు పండించే ప్ర‌త్యేక అన్నాన్ని (Shree Anna) ప్రదర్శించడంపై ఆది మహోత్సవంలో ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు  ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nitin Nabin Assets Full Details | Nitin Nabin 2025 Election | Loans, Property | Asianet News Telugu
సొంతూళ్లోనే ఉంటూ రోజుకు రూ.6-7 వేల సంపాదన.. ఓ మహిళ సక్సెస్ స్టోరీ