
అంజలి అరోరా... గతేడాది ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించిన యువతి. ఒక్కపాటతో.... ఆమె సోషల్ మీడియాలో సెలబ్రటీగా మారిపోయింది. అంజలి ఎప్పుటికప్పుడు వైరల్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ.. తన ఫాలోవర్స్ ని అలరిస్తూ ఉంటుంది.
తాజాగా ఈసారి అంజలి కామెరూనియన్-అమెరికన్ సింగర్ లిబియాంకా ఫోంజి పాట 'పీపుల్'కి పొట్టి స్కేటర్ డ్రెస్ ధరించి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అంజలి అరోరా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ట్రెండ్‌కి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే 12.2 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ని కలిగి ఉంది. ఆమె ప్రాజెక్ట్‌లు, మ్యూజిక్ వీడియోలు, ఇతర విషయాల గురించి తరచుగా అప్‌డేట్‌లను పంచుకుంటుంది.
కొంతకాలం క్రితం ఆమె దీపికా పదుకొణె నటించిన బేషరమ్ రంగ్ పాటకు డ్యాన్స్ వేసింది. ఆ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆమె కచ్చాబాదం పాటతో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకోవడం గమనార్హం.