రామాలయం ప్రాణప్రతిష్ట : ఏడురోజులపాటు ఉపవాసదీక్షలోనే ప్రధాని మోడీ.. ఎలాంటి కఠోరనియమాలు పాటిస్తున్నారంటే...

By SumaBala Bukka  |  First Published Jan 16, 2024, 2:28 PM IST

జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. దీనికి ముందు వారు అన్ని రకాల వైదిక ఆచారాలను పాటిస్తారు.


అయోధ్య : జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. దీని కోసం ప్రధాని అన్ని రకాల వైదిక ఆచారాలను పాటిస్తారు. జనవరి 16 నుంచి అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటి నుండి జనవరి 22 వరకు, ప్రధాని మోడీ కఠిన నియమాలు ఆచరించనున్నారు. 

కేవలం పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. నిద్రించడానికి కూడా ఒక దుప్పటి, మంచం మాత్రమే ఉపయోగిస్తారు. దేశవిదేశాల్లోని రామభక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమానికి ప్రధాని తన వంతుగా ఎంతో భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్నారు.

Latest Videos

అయోధ్యకు హెలికాప్టర్‌లో వెళ్లొచ్చు..ఎక్కడినుంచి? ఎలా? ఎంత ఛార్జ్ అంటే...

మరోవైపు, బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం మంగళవారంనుంచి అయోధ్యలో మొదలయ్యింది. జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడు ప్రతిష్ట జరగనుంది. ఆ తరువాతినుంచి సామాన్య భక్తులకు కూడా దర్శనం ఇవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో అయోధ్య అంగరంగవైభవంగా ముస్తాబయ్యింది. భక్తుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ-కార్ సర్వీస్ కూడా ప్రారంభమైంది. 

అడుగడుగునా అనేక భాషల్లో సైన్ బోర్డులు వెలిశాయి. అయోధ్యకు వెళ్లేవారికోసం రూంలు బుక్ చేసుకోవడానికి ప్రత్యేకంగా యాప్ కూడా ప్రారంభించారు. వేలాది టెంట్ హౌజులను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. 

click me!