అయోధ్యకు హెలికాప్టర్‌లో వెళ్లొచ్చు..ఎక్కడినుంచి? ఎలా? ఎంత ఛార్జ్ అంటే...

By SumaBala Bukka  |  First Published Jan 16, 2024, 1:45 PM IST

జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఈ సమయంలో దాదాపు 100 విమానాలు రాంనగరికి వెడతాయి. ఇందుకు సంబంధించి ఎయిర్‌పోర్టు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. సమీపంలోని విమానాశ్రయాలతోనూ చర్చలు జరుపుతున్నారు.
 


అయోధ్య : బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం మంగళవారంనుంచి అయోధ్యలో మొదలయ్యింది. జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడు ప్రతిష్ట జరగనుంది. ఆ తరువాతినుంచి సామాన్య భక్తులకు కూడా దర్శనం ఇవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో అయోధ్యలో అనేక మార్పులు జరిగాయి. రామాలయానికి భక్తులను చేరవేయడానికి రైల్వే స్టేషన్లు, విమానాశ్రయం సిద్ధంగా ఉన్నాయి. ఈ-కార్ సర్వీస్ కూడా ప్రారంభమైంది. 

కాగా, లక్నో నుంచి అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలను ప్రారంభించే యోచనలో ఉంది. దీనికి జనవరి 19 తేదీని ఫిక్స్ చేశారు. లక్నో నుంచి అయోధ్యకు వెళ్లే హెలికాప్టర్ సర్వీస్‌లో 8-18 మంది భక్తులు వెళ్లవచ్చు. మీడియా కథనాల ప్రకారం, ప్రయాణీకులు దీనిని ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ఛార్జీలు, బుకింగ్ షెడ్యూల్ గురించి సమాచారం జనవరి 16 సాయంత్రంలోపు అందుబాటులో ఉంటుంది.

Latest Videos

undefined

అయోధ్య : నెటిజన్ల మనసు దోచుకుంటున్న కాశ్మీరీ అమ్మాయి రామకీర్తన.. మీరూ వినండి...

ఈ సర్వీస్ తో లక్నో- అయోధ్య మధ్య దూరం 30 నుండి 40 నిమిషాలు ఉంటుంది. మొదట్లో 6 హెలికాప్టర్లను నడపనున్నామని, వీటిని అయోధ్య నుంచి లక్నో వరకు నడపనున్నట్లు నివేదికల్లో తెలిపారు. అయోధ్య ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ వినోద్ కుమార్ సోమవారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కార్యదర్శి చంపత్ రాయ్‌తో సమావేశమై జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠా రోజున సుమారు 100 విమానాలు అయోధ్యకు చేరుకుంటాయని తెలియజేశారు. 

వీటికి సంబంధించి అన్నీ ఒకటి రెండు రోజుల్లో ఖరారు కానున్నాయి. అయోధ్య విమానాశ్రయంలో పార్కింగ్ సౌకర్యం లేనందున సమీపంలోని విమానాశ్రయాలను సంప్రదిస్తున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. దాదాపు 100 విమానాల ల్యాండింగ్ వివరాలు తనకు చేరాయని చెప్పారు. అయోధ్యతో పాటు లక్నో, కాన్పూర్, గోరఖ్‌పూర్ వంటి సమీపంలోని విమానాశ్రయాల్లో ప్రయాణికులను దించనున్నారు. 

ప్రధాని విమానం వచ్చే రోజు ఒక నాలుగు ఎయిర్‌స్ట్రిప్‌లు పుల్ అవుతాయి. దీంతో మరో నాలుగు స్ట్రిప్‌లు మాత్రమే మిగిలి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, అతి ముఖ్యమైన అతిథులు మాత్రమే ఇక్కడ వసతి కల్పిస్తారు.
 

click me!